2019 సెకండాఫ్లో దాదాపు 300 కోట్ల బడ్జెట్తో సాహో సినిమాని యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను ఆగష్ట్ 15న స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని భావించినా ఇంకా సినిమాలో కొన్ని సీన్లకు విజువల్ ఎఫెక్ట్స్ జోడించాల్సి ఉండటం, మొదట అనుకున్న సంగీత దర్శకులు మారిపోవటం వలన మ్యూజిక్ పనుల్లో కూడా సాహో సినిమాకు జాప్యం జరుగుతుండటంతో సాహో సినిమా ముందుగా అనుకున్న తేదీకి రావటం లేదు. సోషల్, వెబ్ మీడియాలో ఆగష్ట్ 30 న సాహో విడుదల అవుతుందని చెబుతున్నా ఆ తేదీకి కూడా సినిమా సిధ్ధం కావటం కష్టమేనని తెలుస్తుంది. 
 
ఈ కారణం వలనే సాహో సినిమా విడుదల డేట్ అధికారికంగా మేకర్స్ ప్రకటించలేదు. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం సెప్టెంబర్ 6 లేదా 13న సాహో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ డేట్స్ మిస్ ఐతే మాత్రం అక్టోబర్ 2 వ తేదీన సైరా నరసింహారెడ్డి విడుదల ఉంది. కాబట్టి సాహో సినిమా సైరా కంటే రెండు వారాల ముందే విడుదల చేయాల్సి ఉంది. సాహో సినిమా సెప్టెంబర్ కు వెళితే నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. 
 
మరో వైపు సాహో సినిమా ఆలస్యం అవటం వలన మూడు టాలీవుడ్ సినిమాలు లాభపడ్డాయి. నాగార్జున ఆగష్ట్ 9 న మన్మథుడు2 సినిమాని విడుదల చేయాలని ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ సాహో ఆగష్ట్ 15న విడుదలయి ఉంటే మన్మథుడు2 సినిమాకు హిట్ టాక్ వచ్చినా మన్మథుడు2 సినిమా సాహో సినిమా కోసం కొన్ని థియేటర్లు త్యాగం చేయాల్సి వచ్చేది. ఎవరు, రణరంగం సినిమాలు కూడా సాహో ఆలస్యం అవ్వటంతో ఆగష్ట్ 15న విడుదల కాబోతున్నాయి. మరో రెండు రోజుల్లో సాహో మేకర్స్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి సాహో ఎప్పుడు విడుదల కాబోతుందో అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: