తెలుగులో ఓ సామెత ఉంది. తంతే బూరెల బుట్టలో పడ్డాడు అని. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి పరిస్థితి అలానే ఉంది. ఇటివల విడుదలైన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు. సస్పెన్స్ ధ్రిల్లర్ అయినా కథాబలం ఉండటంతో బీ, సీసెంటర్లలో కూడా మంచి కలెక్షన్లు రప్పించుకుని సినిమాని హిట్ చేసుకున్నాడు.

 

ప్రేక్షకుల్లో కూడా నవీన్ నటనపై నమ్మకం ఏర్పడింది. దీంతో టాలీవుడ్ లో మనోడి పరిస్థితి బాగుంది. ప్రస్తుతం.. గతంలో పిట్టగోడ అనే సినిమా తీసిన అనుదీప్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. వైజయంతీ సంస్థ నుంచి కూడా ఓ సినిమా ఆఫర్ వచ్చిందని టాక్. కథా చర్చల్లో దాదాపు ఆరేడు సినిమాలు లైన్ లో ఉన్నాయట. సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో వరుస సినిమాలు కాకుండా సబ్జెక్ట్ పై దృష్టిపెట్టి తన కెరీర్ కు ఉపయోగపడే సినిమా కథలను ఎంచుకునే పనిలో పడ్డాడట ఈ ఏజెంట్.

 

వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో నిజమైన సక్సెస్ ఉందని నవీన్ నిరూపిస్తున్నాడు. కామెడీ, పాటలులేని సినిమా తెలుగులో ఇంతలా ఆకట్టుకోవడం సాధారణ విషయం కాదు. ఇలా తీసి కూడా ఆడియన్స్ ను మెప్పించడమంటే గొప్ప విషయమే. లైఫ్ ఈజ్  బ్యూటిఫుల్, వన్ సినిమాల్లో నటించిన నవీన్ కు ఏజెంట్ సినిమా బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: