యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ద కపూర్ హీరోయిన్‌గా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా సాహో. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడడం ఫ్యాన్స్ ను బాగా నిరాశకు గురిచేసింది. అనధికారికంగా వాయిదా అన్న వార్త బయటకు వచ్చింది కానీ, ఇప్పటి వరకు సాహో నిర్మాతలు యువి క్రియేషన్స్ నుంచి క్లారిటీ అయితే ఇప్పటివరకు రాలేదు. 
వాస్తవంగా సాహో ఆగస్ట్ 15 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ డేట్ నుండి వాయిదా అని తెలుస్తోంది.

ఇదిలావుంటే సాహో ఈనెల 30న విడుదలవుతుందని, అది సరైన డేట్ అని, వినాయకచవితి సందర్భం, అమెరికాలో కూడా సెలవులు వున్నాయని వినిపిస్తోంది. మరి ఆ రోజుకు వస్తుందా? రాదా? అన్నది పక్కా కూడా క్లారిటీలేదు. ప్రస్తుతం సాహో యూనిట్ డేట్ ఎప్పుడు అన్నది డిసైడ్ చేసుకునే పనిలో వున్నట్లు లేటెస్ట్ న్యూస్.

అన్ని పనులు ఎప్పటికి ఫినిష్ అవుతాయి? విఎఫ్ఎక్స్ పనులు కచ్చితంగా ఏ డేట్ కు వస్తాయి? థియేటర్ల అవైలబులిటీ? హాలీడేస్? ఇవన్నీ పక్కాగా చూసుకుని డేట్ అనౌన్స్ చేయాలని ఆలోచిస్తున్నారట. మరోసారి ఇప్పుడు వాయిదా పడినట్లు పడే ప్రసక్తి లేకుండా చూసుకోవాలని యు.వి యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. ఇక ఈ సినిమా ఈనెల 30న విడుదల చేయడానికి సాధ్యమవుతుందా? లేక సెప్టెంబర్ 13ను డేట్ గా ప్రకటించాలా? అన్న చర్చలు సాగుతున్నట్లు మరో న్యూస్. ఈ విషయంలో అసలు క్లారిటీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే ఆలోచనలో యువి నిర్మాణ సంస్థ వుందట. ఏదేమైనా ఈ భారీ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: