బాలీవుడ్ లో కొత్త తరహా కథలతో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.  అప్పుడెప్పుడో దోస్తానా అనే సినిమా వచ్చింది.  ఆ మూవీ గే కు సంబంధించిన సినిమా.  ఇందులో జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రాలు నటించారు.  సినిమా సూపర్ హిట్టైంది.  


కరణ్ జోహార్ దోస్తానా 2 ను సిద్ధం చేస్తున్నారు.  ఇందులో కపూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆర్యన్ కార్తీక్, జాన్వీ కపూర్ లు అన్నాచెల్లెలుగా నటిస్తున్నారు.  మరో వ్యక్తి కోసం కరణ్ జోహార్ అండ్ కో సెర్చ్ చేస్తున్నారు.  అన్న ఓ అబ్బాయిని ప్రేమిస్తాడు. అతను గే.  అదే వ్యక్తిని చేల్లెలు కూడా ప్రేమిస్తుంది.  


దీనిని ఫన్నీగా చూపించబోతున్నారు.  సెప్టెంబర్ నుంచి సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.  సెప్టెంబర్ వరకు ఈ ఇద్దరు బిజీగా ఉంటారట.  సెప్టెంబర్ లో ఇద్దరి సినిమాలు పూర్తవుతాయి.  ఆ తరువాత ఈ సినిమాలను సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు.  


ప్రస్తుతం జాన్వీ కపూర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారి గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తూనే `రూహ్ అఫ్జా` అనే చిత్రంతోనూ బిజీగా ఉంది. ఇవన్నీ సెప్టెంబర్ నాటికి పూర్తయిపోతాయట. అటుపై దోస్తానా 2 సెట్స్ లోకి జాయిన్ అవుతారని తెలుస్తోంది. కార్తీక్ ఆర్యన్ `భూల్ బులయా` సీక్వెల్ కి సంతకం చేశాడు. అది జనవరి నుంచి సెట్స్ పైకి వెళుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: