సినిమా ఇండస్ట్రీలో రచయిత, దర్శకులు ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తారు. ఒకవేళ ఆ హీరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే అదే కథతో వేరే హీరోతో సినిమా తీస్తారు. ప్రస్తుతం రామ్ చరణ్ ను దృష్టిలో పెట్టుకుని రాసిన కథకు నాగచైతన్య ఓకె చెప్పాడని తెలుస్తుంది. కథకు చిన్న చిన్న మార్పులు చేసిన తరువాత ఈ సినిమా మొదలవుతుందని సమాచారం. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తారు. 
 
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసాడు మేర్లపాక గాంధీ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ సినిమా తరువాత శర్వానంద్ తో తీసిన ఎక్స్ ప్రెస్ రాజా కూడా సూపర్ హిట్టైంది. కానీ నానితో తీసిన కృష్ణార్జున యుధ్ధం ఫ్లాప్ అయింది. మేర్లపాక గాంధీ చెప్పిన కథ రామ్ చరణ్ కు నచ్చినప్పటికీ ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉండటంతో ప్రస్తుతానికి సినిమా చేయటం కుదరదని చెప్పినట్లు తెలుస్తుంది. 
 
ఇదే కథ నాగచైతన్యకు వినిపిస్తే నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య వెంకీమామ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మేర్లపాక గాంధీ సినిమా మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తుంది. మజిలీ సినిమాతో 40 కోట్ల క్లబ్బులో చేరాడు నాగచైతన్య. కెరీర్లో ఫ్లాపులు రాకుండా నాగచైతన్య సినిమాలు జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటున్నాడట. త్వరలోనే మేర్లపాక గాంధీ నాగచైతన్య సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: