రానా దగ్గుపాటి, ఈ స్టార్ హీరో క్రేజ్ బాహుబలి తరవాత ఎంత పెరిగిందో అందరికి తెలుసు, అందుకోసం తాను పడిన కస్టమ్ ఆ సినిమా సక్సెస్ తరవాత తాను ఒప్పుకుంటున్న డిఫరెంట్ సినిమాలు కూడా అందరికి తెలుసు.


కానీ, బాహుబలి కి బాడీ పెంచిన తరవాత, వెంటనే రానా సన్నగా అయ్యి దర్శనం ఇచ్చాడు. మరి బాగా సన్నగా అవ్వడం తో అందరు రానా కి కిడ్నీ ప్రాబ్లెమ్ ఉందని ఊహాగానాలు లేపారు. దీనికి సమాధానం ఇస్తూ, స్వయం గా సురేష్ బాబు, రానాకి జస్ట్ కంటి ప్రాబ్లెమ్ ఉందని, తాను సన్నగా అయ్యింది 'హతి మేరె సాతి' సినిమా కోసం అని  క్లారిటీ ఇచ్చారు.


ఇది ఇలా ఉండగా, ఎవరికీ తెలీకుండా రానా అమెరికా వెళ్లి కిడ్నీ సమస్య కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని తెలిసింది. గత సంవత్సరం నుంచి రానా కిడ్నీ ప్రాబ్లెమ్ తో బాధపడుతున్నాడు అని, హైదరాబాద్ మరియు ముంబై లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.


కానీ ట్రీట్మెంట్ తో రానా కండిషన్ బెటర్ అవ్వకపోవడం తో, వాళ్ళ అమ్మగారు, అమెరికా లో ట్రీట్మెంట్ బావుంటుంది అని అక్కడికి తీసుకెళ్లారు అంట, అక్కడ, టాప్ నెఫ్రోలోజిస్ట్స్ రానా కి ట్రీట్మెంట్ చేస్తారు అని, అవసరం అయితే, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ చెయ్యవలసి ఉంటుంది అని తెలుస్తోంది. ఇంకా అవసరం అయితే, రానా వాళ్ళ అమ్మగారు కిడ్నీ డొనేట్ చెయ్యడానికి రెడీ గా ఉన్నారని తెలుస్తోంది.    


మరింత సమాచారం తెలుసుకోండి: