ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో మూవీ షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది.  ఇప్పటికే ఫస్ట్ హాఫ్ లాక్ చేశారని సమాచారం.  సెకండ్ హాఫ్ షెడ్యూల్ జరుగుతున్నది.  ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బోలెడు ఉన్నాయి.  ఈ సన్నివేశాలను భారీ ఖర్చుతో తెరకెక్కించారు.  


కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే ఏకంగా రూ. 90 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారట.  ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నది.  ఇక్కడ మరో విషయం కూడా బయటకు వచ్చింది.  ఇందులో ప్రభాస్ కోసం ఓ కారును వినియోగించారు.  అది యాక్షన్ సీన్స్ సమయంలో వస్తుంది.  


ఈ కారును రూ. 5 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు.  సినిమాలో ఈ కారు హైలైట్ అవుతుంది.  సినిమా ప్రచారంలో భాగంగా ఈ కారును ఫ్యాన్స్ కు పరిచయం చేయబోతున్నారట.  ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకల్లో ఈ కారును వినియోగించాలని అనుకంటున్నట్టు సమాచారం.  


ప్రభాస్ కు జోడిగా ఇందులో శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.  సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి మ్యూజిక్ దర్శకులు చాలా మంది ఉన్నారు.  బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను జిబ్రాన్ అందిస్తున్నారు.  యువీ క్రియేషన్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: