బిగ్ బాస్ సీజన్ 3 హంగామా మొదలైంది. ఈసారి కింగ్ నాగార్జున హోస్ట్ గా బాధ్యతలు మీద వేసుకున్నారు. ఆల్రెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాతో హోస్ట్ గా సక్సెస్ అయిన నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా మొదటిసారి చేస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 1 యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా అదరగొట్టాడు.


సీజన్ 2 నాచురల్ స్టార్ నాని కూడా బాగా చేశాడు. ఇక ఇప్పుడు సీజన్ 3 కోసం నాగ్ రంగంలోకి దిగాడు. 60 ఏళ్లు దగ్గర పడుతున్నా యువ హీరోలకు ధీటుగా ఉండే నాగార్జున చార్మింగ్ అంతకుమించిన ఉత్సాహం అన్ని ఆడియెన్స్ కు నచ్చేస్తాయి. ఆదివారం మొదలైన బిగ్ బాస్ సీజన్ 3 ఆశించిన స్థాయిలో లేదన్నది టాక్.


నాగార్జున అంతా హడావిడిగా చేశాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన తొందరపడ్డది దేనికి అంటే 15 మంది కంటెస్టంట్స్ ఎంట్రీలు.. వాళ్లకు సంబందించిన పాటలు ఇలా అన్ని వచ్చాయి కాబట్టి నాగార్జున కాస్త హడావిడి చేసినట్టు అనిపించింది. పరిచయం చేయడం వెంటనే హౌజ్ లోకి పంపించడమే నాగార్జున వంతు అయ్యింది.


అయితే ముందు సీజన్లలో హోస్ట్ గా చేసిన వారితో నాగార్జునను పోల్చుతున్నారు. ఎన్.టి.ఆర్ కు హోస్టింగ్ కొత్త అయినా ఆయన ఓ రేంజ్ సెట్ చేసి వెళ్లాడు. ప్రతి ఒక్కరితో చాలా జోవియల్ గా మాట్లాడుతూ బిగ్ బాస్ సీజన్ 1 సక్సెస్ చేశాడు. నాని కూడా తన శక్తిమేరకు ప్రయత్నించాడు. ఇక ఇప్పుడు నాగార్జున వంతు వచ్చింది. మొదటిరోజు సూపర్ అనిపించుకున్న నాగ్ షో సక్సెస్ చేస్తాడో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: