గతంలో నాగార్జున ప్రథాన పాత్రలో నటించిన మన్మధుడు మంచి విజయాన్ని సాధించింది. చాలా కాలం తర్వాత హిరో రాహుల్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన మళ్ళీ నాగార్జుననే హీరోగా నటించిన చిత్రం మన్మధుడు 2. ఈ చిత్రంలో నాగార్జునతో పాటు రకుల్, సమంత, కీర్తిసురేశ్‌ కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన నాగార్జున, రకుల్  టీజర్ టీజర్లు బయటకురావడంతో చిత్రం విడుదలకు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

`మన్మధుడు 2` టీజర్ లోనే  ఈ ఏజ్ లో నీకు పెళ్లేంటి?  అంటూ సెటైర్లు ఓ వైపు..  గుట్టు చప్పుడు కాకుండా చిలక్కొట్టుడు ఇంకోవైపు..నాగ్ క్యారెక్టర్ తో పాటు కథ గుట్టు విప్పేశారు. నాగార్జున హీరోగా నటిస్తున్న `మన్మధుడు 2` ఎలా ఉండబోతోందో అందరికీ ముందే తెలిసిపోయింది. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ అల్ట్రా మోడ్రన్ గాళ్ గా కనిపించబోతోంది. అంతకుమించి చెలరేగే అందగత్తెలు కనిపించబోతున్నారని తాజా విజువల్స్ చెబుతున్నాయి.

తాజాగా  `హేయ్ మెనీనా..` అంటూ సాగే లిరికల్ వీడియో రిలీజైంది. ఈ వీడియోలో నాగ్ రొమాన్స్ పీక్స్ అనే చెప్పాలి. టైటిల్ కి తగ్గట్టే అందమైన అమ్మాయిలతో కింగ్ ప్రతి ఫ్రేమ్ లోనూ రొమాన్స్ చేస్తూ కనిపించారు. లవ్ చేయను.. ఓన్లీ లవ్ మేక్ చేస్తా! అంటూ మన్మధుడు అసలు సంగతిని చెప్పకనే చెప్పేశాడు. చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బాణి పెప్పీగా ఆకట్టుకుంది. ట్రెడిషనల్ బీట్ కి  వెస్ట్రన్ స్టైల్ ని మిక్స్ చేసి ఈ బాణీని రూపొందించారు. అద్భుతమైన ఫారిన్ లొకేషన్లలో నాగార్జునపై చిత్రీకరించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.

వెన్నెల కిషోర్ పాత్రకు సంబంధించిన ఇంట్రో ఈ పాటలో ఆకట్టుకుంది. ``అయినా అంత సులువుగా ఎలా పడేస్తార్ సర్ అమ్మాయిల్ని?`` అంటూ వెన్నెల కిషోర్ ఎంట్రీ ఇస్తే.. `పడేయడమేంట్రా.. ఆ మాటంటేనే చిరాకు!` అంటూ మన్మధుడి కలరింగ్ బావుంది. ఇలా సందర్భానుసారం వచ్చే పాటల్లోనే కథను.. నాగ్ క్యారెక్టర్ ని డ్రైవ్ చేశారని అర్థమవుతోంది. ఈ విజువల్స్ లో నాగ్ ఏజ్ సగానికి సగం తగ్గిపోయింది. హేయ్ మెనీనా లిరిక్ ని శుభమ్ విశ్వనాథ్ రాశారు. ర్యాపర్ మేఘరాజ్ రవీంద్ర పాటను ఆలపించారు. మన్మధుడు 2 ట్రైలర్ జూలై 25న, ఆగస్టు 9న సినిమా విడుదల కానుంది.

https://youtu.be/xByu4CdDK2s

మరింత సమాచారం తెలుసుకోండి: