డేరింగ్ అండ్ డేషింగ్ హీరోలు చాలా మంది ఉన్నారు. మరి డైరెక్టర్లలో ఉన్నారా అంటే ఇప్పటి టైమ్ లో బాగానే ఉన్నారు. వారిలో చాలా మంది ఇపుడు కాంట్రవర్సీ కి కూడా కేరాఫ్ అడ్రస్ అయ్యారు. అటువంటి వారి విషయంలో ఇండస్ట్రీ కూడా స్పెషల్ లుక్ వేస్తుంది. ఇక ఆడియన్స్ సైతం వారి గురించి తెలుసుకోవడానికి ఎపుడూ అటెన్షన్ గా  ఉంటారు.


లేటెస్ట్ గా ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్ కొట్టి తిరిగి  ట్రాక్ లోకి వచ్చిన పూరీ జగన్నాధ్ తన గురువు రామ్  గోపాల వర్మ మాదిరిగానే దూకుడు మీదుంటారు. తాను అనుకున్నది చేసితీరుతారు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాదేస్తూంటారు. ఆ విషయంలో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనన్న ఆలోచనలే ఆయనకు ఉండవు. లేటెస్ట్ గా మహేష్ బాబు మీద ఆయన చేసిన కామెంట్స్ ఇందుకు ఉదాహరణ.



ఇదిలా ఉండగా పూరీకి కొడుకు ఉన్నాడని తెలుసు. పేరు ఆకాష్. రెండు మూడు సినిమాల్లో కూడా హీరోగా  నటించారు. ఇక కూతురు కూడా ఉంది. పేరు పవిత్ర. ఆ అమ్మాయి బుజ్జిగాడు మూవీలో చిన్నప్ప‌టి త్రిషగా నటించిందిట. ఇపుడు లేటెస్ట్ గా ఇన్స్ట్రాగ్రాం లో పవిత్ర పెట్టిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాను బాగా  ఆకట్టుకుంటున్నాయి.



పూరి కూతురు పవిత్ర కు హీరోయిన్ ఫీచర్స్ ఉన్నాయని కూడా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ అమ్మడు తెర పైన నటించే చాన్స్ ఉందా అన్న చర్చ సాగుతోంది. తండ్రి ఎటూ డైరెక్టర్, సోదరుడు హీరో కాబట్టి, పవిత్ర కూడా వెండి తెర మీద తన నటనను ప్రదర్శించే చాన్స్ అయితే ఉంది. కానీ ఈ అమ్మడుకు డైరెక్షన్ మీద ఎక్కువ ఇంట్రస్ట్ ట. మరి చూడాలి పూరీ ఆమెను ఎలా పరిచయం చేస్తారో.



మరింత సమాచారం తెలుసుకోండి: