రాజుగారి గ‌ది 3 అనే సినిమా చేస్తున్నారు ఓంకార్‌, ఆ గ‌దిలోకి వెళ్ల‌డానికి హీరోయిన్లు ఎవ‌రూ ఇంట్ర‌స్ట్ చూపించ‌డం లేదు. చివ‌రాఖ‌రికి అవికాగౌర్ అందుకు ఒప్పుకుంది. రాజుగారి గ‌ది-3లో లీడ్ రోల్ పోషించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. త్వ‌ర‌లో దీని పై అఫీషియ‌ల్ స్టేట్‌మెంట్ రానుంది.


ముందుగా ఈ సినిమాలో మిల్కీబ్యూటీ త‌మ‌న్నాను అనుకున్నారు.  ఓపెనింగ్‌ద‌కు కూడా హాజ‌రైన ఆమె, త‌ర్వాత హ్యాండ్ ఇచ్చింది. త‌ర్వాత కాజ‌ల్‌ను అనుకున్నారు. కానీ కాజ‌ల్ కూడా ఓంకార్ అన్న‌య్కు చాక‌చ‌క్యంగా హ్యాండ్ ఇచ్చింది.ఆ త‌ర్వాత నందిత శ్వేత‌, తాప్సి లాంటి పేర్లు కూడా తెర‌పైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఓంకార్ గ‌ది లోకి వెళ్లేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డంలేదు. చివ‌రికి అవికా గౌర్ అందుకు ఒప్పుకుంది. అవికా ఈ సినిమా ఒప్పుకోవ‌డానికి ఓ రీజ‌న్ ఉంది. ఎవ‌రు ఛాన్స్ ఇస్తారా అని ఎదురు చూస్తోంది ఈ బ్యూటీ. కొన్ని కార‌ణాల వ‌ల్ల టాలీవుడ్ అంతా ఈమెను అన్ - అఫీషియ‌ల్‌గా బ్యాన్ చేసింది. 


అందుకే ఎక్క‌డికి పోతావ్ చిన్న‌వాడా, ల‌క్ష్మీరావే మా ఇంటికి, సినిమా చూపిస్త‌మామ లాంటి సినిమాలు హిట్ అయిన‌ప్ప‌టికీ అవికాకు మ‌ళ్లీ అవ‌కావాలు రాలేదు. ఎట్ట‌కేల‌కు ఓంకార్ ఈమెకు ఓ అవ‌కావం ఇచ్చాఉ. అదే ఇప్పుడు మ‌హాప్ర‌సాదం. అందుకు మారు మాట్లాడ‌కుండా ఈ సినిమాలో న‌టించ‌డానికి ఆమె ఒప్పుకుంద‌ని స‌మాచారం


మరింత సమాచారం తెలుసుకోండి: