‘బిగ్ బాస్ 3’ షో మొదలై మూడురోజులు పూర్తి కావడంతో ఈషోలో ఉన్న హౌస్ మేట్స్ పై సెటైర్లు మొదలైపోయాయి. ఈషో ప్రారంభం అయి ఇప్పటికి కేవలం మూడు రోజులు మాత్రమే అయినా ‘బిగ్ బాస్’ హౌస్ లో ఆధిపత్య పోరు అప్పుడే మొదలైపోయింది. 

ముఖ్యంగా శ్రీముఖి ఓవర్ యాక్షన్ వరుణ్ వితికల ఓవర్ రొమాంటిక్ నటన పై విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. బిగ్ బాస్ షో చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈ షోలో మొదటిసారి నిజ జీవితంలో భార్య భర్తలు అయిన వరుణ్ సందేశ్ వితిక లకు ఒకేసారి ఈ షోలో అవకాశం ఇచ్చారు. 

వరుణ్ సందేశ్ వితికలు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి వారిద్దరు గేమ్ గురించి ఆలోచించకుండా వీరిద్దరూ వింతగా ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటూ మధ్యలో బాతాకానీలు పెట్టుకుంటూ మధ్యలో రొమాంటిక్ మాటలతో కాలం గడుపుతున్నారు. హౌస్ మేట్స్ అంతా ఒకరకంగా ఉంటే తామిద్దరం మాత్రం వేరు అన్నట్లుగా ఈ జంట బిగ్ బాస్ షోలో ప్రవర్తిస్తున్న తీరు చూసి చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. 

దీనితో వీలైనంత ఎక్కువరోజులు ఈషోలో కొనసాగేందుకు వీరిద్దరు ప్రయత్నిస్తున్నారు కాని అసలు షో కాన్సెప్ట్ వీరికి తెలుసా అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. వితిక ఎలిమినేషన్ జోన్ లోకి వెళ్ళిపోయిన పరిస్థితులలో టెన్షన్ లో వీరిద్దరూ ఇలా ప్రవర్తిస్తున్నారా లేకుంటే ఈషోలో తాము ఎందుకు వచ్చామో తమకే తెలియక అయోమయ స్థితిలో ఇలా కొనసాగుతున్నారా అంటూ బుల్లితెర ప్రేక్షకులు చేస్తున్న కామెంట్స్ ను బట్టి ఈ జంట ఎక్కువ రోజులు ‘బిగ్ బాస్ 3’ షోలో కనిపించడం సందేహంగానే అనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: