ఇండస్ట్రీలో కొన్న కాంబినేషన్లకు హైప్ ఉంటుంది. మరికొన్ని సినిమాలు ఎప్పుడొస్తాయా అనే క్యూరియాసిటీ కూడా ఉంటుంది. మరికొన్ని సినిమాలకు హీరో వల్ల క్రేజ్ వస్తూంటుంది. ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణ తోడైంది. అదే గ్యాంగ్ లీడర్ టైటిల్. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే పవర్ ఫుల్ టైటిల్ గా అభిమానుల గుండెల్లో ఉండిపోయింది. ఈ టైటిల్ తో ఈ సినిమాపై ప్రత్యేకమైన బజ్ ఏర్పడింది.

 

ఈ సినిమా టీజర్ ను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. సినిమాలో ఏదో కంటెంట్ ఉన్న ఆసక్తిని దర్శకుడు రేకెత్తించాడు. లైఫ్ సైక్లింగ్ లాంటిది అన్నట్టు ఈ సినిమాలో చిన్న పిల్ల దగ్గరనుంచి బామ్మ వరకూ ఐదుగురు క్యారెక్టర్లు ఉన్నాయి. వీళ్లందరినీ చూస్తూంటే పుట్టుక నుంచి చావు వరకూ ఓ లైఫ్ సైకిల్ మొత్తం చూస్తున్నట్టు ఉంది.. అంటూ నానీ చెప్పే డైలాగ్ సినిమాలో ఉంది. దీనిని బట్టి చూస్తే నాని, ఐదుగురు ఆడవాళ్ల చుట్టూ ఉండే కథగా తెలుస్తోంది. అనిరుథ్ మ్యూజిక్, మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందం టీజర్ లో కనబడింది. టీజర్ తో అయితే నానీ హైప్ క్రియేట్ చేసాడనే చెప్పాలి. టీజర్ లో మెగాస్టార్ చిరంజీవి మాస్క్ ను కూడా చూపించి చిరంజీవి అభిమానులను ఖుషీ చేస్తున్నట్టున్నారు.


అన్ని ప్రత్యేకతలు ఉన్న గ్యాంగ్ లీడర్ కు విక్రమ్ – నానీ కాంబినేషన్ కొత్తగా ఉండి ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక నానీ సెలక్టడ్ స్టోరీస్ చేస్తాడనే పేరు ఎలానూ ఉంది. ఆగష్టు 30 వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది ఈ నానీ గ్యాంగ్ లీడర్. అయితే ప్రభాస్ సాహో రిలీజ్ కూడా అదే డేట్ ను లాక్ చేయడంతో ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం.. ఈ గ్యాంగ్ లీడర్ ఏం చేస్తాడో!


మరింత సమాచారం తెలుసుకోండి: