ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి చాలా రోజుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయం లభించింది. ఈ సినిమాలో రామ్ కనబరిచిన నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఎప్పుడు గుడ్ బాయ్ గా సాఫ్ట్ గా ఉండే పాత్రలు చేసిన రామ్ ఇస్మార్ట్ శంకర్ తో మాస్ పాత్రలు కూడా చేయగలనని నిరూపించాడు.హైదరాబాదీ కుర్రాడిగా అతను మాట్లాడిన డైలాగులు అందరినీ ఆకట్టుకున్నాయి.


వర్మ శిష్యుడైన పూరిజగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవడంతో రామ్ గోపాల్ వర్మ హైదరాబాదులో చేసిన హంగామా అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా సక్సెస్‌ను ఆ చిత్ర యూనిట్‌ సభ్యుల కంటే కూడా ఎక్కువగా వర్మ ఎంజాయ్‌ చేశాడు. ఆ చిత్రంలో రామ్‌ నటనకు వర్మ ఫిదా అయ్యాడు. ఎంతగా అంటే ఆయనతో ఒక సినిమా తీయాలని నిర్ణయించుకునేంతగా. త్వరలోనే రామ్‌తో ఒక సినిమా తీస్తానంటూ వర్మ ప్రకటించాడు.


వర్మ ఎన్నో సినిమాలు ప్రకటించాడు. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో తెలియదు కాని, వర్మ నుండి మరో తెలుగు సినిమా అంటూ జనాలు బాబోయ్‌ అంటున్నారు.రామ్‌ గోపాల్‌ వర్మ ఎప్పుడు ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటాడో ఆయనకే తెలియదు. రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసేసుకుంటాడు. అలా ఎన్నో సినిమాలను ప్రకటించాడు. అందులో కొన్ని తీయడం కూడా జరిగింది.


 తెలుగులో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం తర్వాత వర్మ ఏ సినిమాను చేయడం లేదు.  ఈమద్య కాలంలో వర్మ చేసిన ఏ సినిమా కూడా ఆడటం లేదు. అయినా కూడా వర్మ మాత్రం తన ప్రయత్నాలను ఆపడం లేదు. వర్మకు ఎన్ని ఫ్లాప్‌లు పడ్డా కూడా హీరోలు ఆయన దర్శకత్వంలో నటించకుండా ఉండలేరు. మరి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రామ్ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడా అనేది తెలియాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: