ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన సీన్స్ ను వేగంగా షూట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కు సంబంధించి ఎన్టీఆర్ వెర్షన్ పూర్తికాగానే ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడట. అక్కడ ఎన్టీఆర్ ఫ్రీకాగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తారని సమాచారం.
ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 మూవీ షూటింగ్ బిజీలో ఉన్నారు. నవంబర్ వరకు షూటింగ్ కంప్లీట్ చేసే అవకాశం ఉన్నది. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు.
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా, ఈ దర్శకుడు ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ తో పూర్తిస్థాయిలో డ్యాన్స్ మూవీ చేయాలని అనుకుంటున్నాడు. దానికి సంబంధించిన కథను కూడా నీల్ రెడీ చేసుకున్నారని తెలుస్తోంది.
ఈ కథ ప్రకారం ఎన్టీఆర్ డ్యాన్స్ కోసం ఎలా కష్టపడ్డాడు. ఎలా డ్యాన్స్ నేర్చుకున్నారు. ఎలా పైకి వచ్చాడు అనే కథతో స్టోరీని రెడీ చేసుకుంటున్నారని సమాచారం. డ్యాన్స్ కథకు సంబంధించిన సినిమా మాత్రం తెలుస్తున్నది. పూర్తి వివరాలు తెలియాలంటే అది కన్ఫర్మ్ అయ్యే వరకు ఆగాల్సిందే.