త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తాజాగా చేస్తున్న `ద‌ర్బార్` సినిమాలో అనేక ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి.. సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు ఏఆర్ ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న మొద‌టిసినిమా.. ఏఆర్ ముర‌గ‌దాస్ అన‌గానే గ‌జిని గుర్తుకు వ‌స్తుంది. గ‌జినీ అన్ని భాష‌ల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించింది.. ఇప్పుడు ర‌జనీకాంత్ , మురుగ‌దాస్ ల ద‌ర్బార్ సినిమా షూటింగ్ పూర్త‌వ్వ‌క ముందే అంచ‌నాలు పెరిగిపోయాయి.. అందులో ర‌జ‌నీకాంత్ పాతికేళ్ల త‌రువాత పోలీస్ ఆఫీస‌ర్ గెట‌ప్‌లో క‌నిపిస్తున్నారు... 69వ బ‌డిలో ప‌డ్డ ర‌జ‌నీకాంత్ మురుగ‌దాస్ సినిమాలో కొత్త‌గా క‌నిపిస్తున్నార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌పడుతున్నారు.. చంద్ర‌ముఖి లాంటి భారీ హిట్ మూవీలో హీరోయిన్‌గా న‌టించిన న‌య‌న‌తార ఈ సినిమాలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌టిస్తున్నది.. ప్ర‌స్తుతం ఈ మూవీ ముంబైలో షూటింగ్ జ‌రుపుకుంటున్న‌ది.. ర‌జ‌నీ పోలీసు గెట‌ప్ లో స్టైలు చూసి అభిమానులు పండ‌గ చేసుకుంటున్నారు...
 
ర‌జ‌నీ రాజకీయాల్లోకి అడుగు పెడతున్నట్లు ప్రకటించాక వరుసబెట్టి సినిమాలు చేసేస్తున్నారు. ‘2.0’ సెట్స్ మీద ఉండగానే.. ‘కాలా’ అనే సినిమాను చేసి దీని తర్వాత చాలా తక్కువ వ్యవధిలో ‘పేట’ అనే చిత్రం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆరు నెలల వ్యవధిలో ఆయన సినిమాలు మూడు రిలీజై ప్రేక్షకులకు షాకిచ్చాయి.
వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆయన పార్టీ ఉంటుంది కాబట్టి ‘దర్బార్’ తర్వాత ఇంకో సినిమా కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ ‘దర్బార్’ తర్వాత కూడా ఇంకో చిత్రం చేయడానికి రజనీ సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలొస్తుండటం విశేషం. ‘పేట’ తీసిన కార్తీక్ సుబ్బరాజ్ మళ్లీ రజనీతో ఇంకో చిత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నార‌ట. మరోవైపు రజనీ ఫేవరెట్ డైరెక్టర్ కె.ఎస్.రవికుమార్ సైతం రజనీతో ఓ సినిమా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్లు స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: