గత ఏడాది కన్నడ నుంచి వచ్చిన ఒక సినిమా మొత్తం అని ఇండస్ట్రీస్ ని ఒకసారిగా శాండల్‌వుడ్‌ వైపు చుసేలా చేసింది. అదే కన్నడ రాక్ స్టార్ యాష్ మరియు ప్రశాంత్ నీల్ ల కాంబినేషన్ లో వచ్చిన "కేజీఎఫ్ చాప్టర్ 1". భారీ హైప్ తో వచ్చిన ఈ కె జి యఫ్ అంచనాలను అందుకోని కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమా గా రికార్డు సృష్టించింది.


యష్ లుక్స్ అలాగే ఆయన నటన సినిమాకు హైలైట్ అవ్వగా, అస్సలు ఎవ్వరు ఊహించని మాస్ ఎలివేషన్ సీన్లు ఈ సినిమాని తారస్తాయికి తిసుకెళ్ళింది . దింతో ఈ చిత్రాన్ని చూసేందుకు మాస్ ఆడియెన్స్ క్యూలు కట్టారు. ఈ ప్రభావం వల్ల మాములుగా ఈ సినిమాకు సంబంధించి ఏ చిన్న న్యూస్ వచ్చినా
అది సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతుంది. దింతో తరువాతి పార్ట్ "కేజీఎఫ్ చాప్టర్ 2" భారి అంచనాలు ఏర్పడాయి.

ప్రశాంత్ నీల్ టీమ్, అధికారికంగా ట్విట్టర్ లో ఒక అప్డేట్ ను ఈ రోజు వదిలారు. దీని ప్రభావం ఇప్పుడు సోషల్ మీడియా మీద పడి మరోసారి ట్రెండ్ అవుతుంది. అది రేపు 11 గంటలకు ఒక పెద్ద న్యూస్ ఉందని వారు ఒక పోస్టర్ తో తెలియచేసారు. మరి ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ ఎలాంటి వార్తను అందజేస్తారో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: