తెలుగు సినిమా చరిత్రలో చిరంజీవిది ఓ అద్ఢుతమైన ప్రస్థానం. అప్పటికి ఇండస్ట్రీని ఏలుతున్న మహామహుల మధ్యకి వచ్చాడు చిరంజీవి. తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసి స్పీడ్ డ్యాన్సులు, ఫైట్లతో ఇండస్ట్రీని తన ఆధీనంలోకి తీసుకుని మెగాస్టార్ గా, నెంబర్ వన్ హీరోగా ఇప్పటికీ ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ముఖ్యంగా మాస్ మేనరిజమ్స్, కామెడీ టైమింగ్ తో ఓ సంచలనాన్నే సృష్టించాడు.

 

ఇప్పుడిదే ఓ స్టార్ హీరోకి లెసన్ గా ఉపయోగపడుతుందట. పదిహేనేళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చిన ఈ స్టార్ హీరోకి చిరంజీవి చేసిన మ్యాజిక్ ఎలా అనేది అర్ధం కావట్లేదట. చిన్న ఎక్స్ ప్రెషన్ కూడా తన స్టైల్, మాస్ లుక్ తో అంత హెవీగా ఎలా హైలైట్ చేస్తాడు అంటూ గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ముఠామేస్త్రి వంటి మాస్ మూవీస్ ని తిప్పి తిప్పి చూస్తాడని సదరు హీరో పర్సనల్ ఎయిడ్స్ చెప్తున్న మాట. మాస్ ఎట్రాక్షన్ లో భాగంగా చిరంజీవి ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ తో డైలాగ్ డెలివరీ ఈ హీరోకి ఇప్పటికీ ఓ మిస్టరీగా ఉంటుదట. అందుకే చిరంజీవి టైమింగ్ ఎలాంటిదో చూసి నేర్చుకోవటానికి మెగాస్టార్ మాస్ సినిమాలను ఎప్పుడూ వీక్షిస్తూంటాడట. డ్యాన్సు చేస్తూ చిరంజీవి పెట్టే ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ ని బాగా గమనిస్తాడట ఈ టాలీవుడ్ స్టార్ హీరో.

 

చిరంజీవి నిజంగా ఓ నటనలో ఓ గ్రంధాలయమే. మూసపద్దతిలో ఉన్న ఇండస్ట్రీని తనవైపుకు తిప్పకునేలా కష్టపడిన చిరంజీవి మాస్ ప్రేక్షకుల్లో తిరుగులేని ఇమేజ్ సాధించాడు. కుటుంబ ప్రేక్షకులైతే రెండున్నర గంటల మనశ్శాంతి కోసం చిరంజీవి సినిమా చూడాల్సిందే అన్న పేరు సంపాదించాడు. అందుకే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు.. తెలుగులో ఇప్పటికీ నెంబర్ వన్ హీరోగా చెలామణీ అవుతున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: