విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా ఈరోజు విడుదలైంది. ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. ఏ సెంటర్లలో ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకోగా బీ, సీ సెంటర్లలో మాత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. డియర్ కామ్రేడ్ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమాను కర్ణాటక రాష్ట్రంలో బ్యాన్ చేయాలని కన్నడిగులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. 
 
ఈ సినిమాను బ్యాన్ చేయమనటానికి కారణం ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉండటమో, ఇతరుల మనోభావాలు దెబ్బతీసే సన్నివేశాలు ఉండటమో కాదు. కర్ణాటక రాష్ట్రంలో కన్నడ సినిమాల కంటే తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఇలా చేయటం వలన కన్నడ సినీ పరిశ్రమకే నష్టం అని సోషల్ మీడియా వేదికగా కన్నడిగులు ప్రచారం చేస్తున్నారు. డియర్ కామ్రేడ్ తెలుగు వెర్షన్ బ్యాన్ చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. 
 
పర భాషా సినిమాల్ని ప్రోత్సహిస్తున్నందుకు కన్నడ చిత్ర పరిశ్రమను కూడా నెటిజన్లు విమర్శిస్తున్నారు. రెండు రోజుల క్రిందట ఒక ఇంటర్వ్యూలో భాగంగా రష్మిక మందన్న కన్నడలో డబ్బింగ్ చెప్పటం కష్టమని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై కన్నడ భాషాభిమానులు రష్మికను బ్యాన్ చేయాలని కన్నడ వాణిజ్య మండలికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. రష్మిక అలా అన్నందుకే డియర్ కామ్రేడ్ సినిమాను కన్నడిగులు టార్గెట్ చేసి ఉండొచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: