నిన్న విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విషయంలో సందేహాలు ఏర్పడటంతో ఈమూవీ కలక్షన్స్ విషయంలో ఎంతవరకు రికార్డులు క్రియేట్ చేస్తుంది అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో ఈమూవీ ‘అర్జున్ రెడ్డి’ ‘గీతాగోవిందం’ మూవీల స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోవచ్చు అన్నఅంచనాలు వస్తున్నాయి.

దీనితో ఇండస్ట్రీ టాప్ హీరోలు అంతా తెరిపినపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీ విడుదలకు ముందు కొనసాగిన మ్యానియాను పరిశీలిస్తే ఈమూవీతో విజయ్ దేవరకొండ టాప్ హీరోల లిస్టులో చేరిపోతాడు అని చాలామంది టాప్ హీరోలు కూడ భావించినట్లు టాక్. అయితే ఈమూవీకి ముఖ్యంగా విజయ్ దేవరకొండకు ప్రశంసలు లభిస్తున్నా 100 కోట్ల నెట్ కలక్షన్స్ సినిమాగా ‘డియర్ కామ్రేడ్’ మారడం అసాధ్యం అని నిన్న వచ్చిన తొలిరోజు ఫలితం సంకేతాలు ఇస్తోంది. 

వాస్తవానికి ఈ ఏడాది విడుదలైన టాప్ హీరోల సినిమాలలో ఇప్పటి వరకు ‘మహర్షి’ మాత్రమే 100 కోట్ల సినిమాగా మారింది. దీనితో ‘మహర్షి’ రికార్డులను డియర్ కామ్రేడ్ బ్రేక్ చేస్తుందా అని మహేష్ అభిమానులు కూడ భయపడ్డారు. అయితే వాస్తవానికి కామ్రేడ్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాగా మారక పోవడంతో ఈమూవీ విజయ్ ను కలక్షన్స్ రికార్డుల విషయంలో మరో మెట్టు ఎక్కించే సినిమాగా మాత్రం మారదు అన్న క్లారిటీ వస్తోంది. 

‘డియర్ కామ్రేడ్’ ఫలితం తేలిపోవడంతో ఇక ఈ ఏడాది రికార్డులు క్రియేట్ చేసే సినిమాల వార్ లో ‘సాహో’ ‘సైరా’ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఈసినిమాకు అనుకున్న కథని పూర్తిగా దర్శకుడు తీయలేక పోవడానికి గలకారణం విజయ్ దేవరకొండకు ఉన్న ‘అర్జున్ రెడ్డి’ ఇమేజ్ ఒక అడ్డంకిగా మారి ఉంటుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విజయ్ సినిమాలో పలానా ఎలిమెంట్స్ ఉంటే మాత్రమే యూత్ కు నచ్చుతుంది అన్న అభిప్రాయానికి ఒక మంచి కథను జోడించి ‘డియర్ కామ్రేడ్’ మూవీతో ప్రయత్నించినా ఈకథలో అనుకున్న పాయింట్ ను క్లారిటీగా చెప్పలేక పోవడంతో పాటు ఈమూవీ నిడివి ‘డియర్ కామ్రేడ్’ బ్లాక్ బస్తర్ హిట్ కు అవరోధంగా మారాయి. ఎదిఎమైనా ఈమూవీ కలక్షన్స్ వాస్తవ పరిస్థితి ఈవీకెండ్ ముగిసిన తరువాత మాత్రమే అంచనా వేయగలం..  


మరింత సమాచారం తెలుసుకోండి: