టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇటీవల క్యాస్టింగ్ కౌచ్ విషయమై ఎంత పెద్ద రాద్ధాంతం జరిగిందో అందరికి తెలిసిందే. వర్ధమాన నటి శ్రీరెడ్డి, తమవంటి అనేకమంది అమ్మాయిలను సినిమా అవకాశాల పేరుతో కొందరు సినిమా కో ఆర్డినేటర్లు మరియు మేనేజర్లు అవకాశాలు ఇప్పిస్తాం అని చెప్పి, తమపై లైంగిక దాడులకు పాల్పడుతున్నట్లు శ్రీరెడ్డి ఒకానొక సమయంలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ముందు ధర్నా చేసింది. 

అయితే అసోసియేషన్ వారి నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో, ఆపై అర్ధనగ్న ప్రదర్శనకు కూడా సిద్ధమైంది. అనంతరం వెంటనే స్పందించిన మా అసోసియేషన్ సభ్యులు, ఆమెను ఆర్టిస్ట్స్ యూనియన్ నుండి సస్పెండ్ చేయడం, తరువాత రెండు రోజులకు సస్పెన్షన్ ను ఎత్తివేయడం వంటి ఘటనలు జరిగాయి. ఇక ఆ తరువాత మహిళల కోసం మా అసోసియేషన్ లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం అని అసోసియేషన్ సభ్యులు కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇక ఆ ఘటన తరువాత శ్రీరెడ్డి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా వైరల్ అయింది. కొద్దిరోజుల తరువాత నటుడు పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను శ్రీరెడ్డి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి కూడా గురైంది. అయితే ఆ గొడవంతా ఆ తరువాత కొన్నాళ్ళకు సద్దుమణిగింది. ఇక కొద్దిరోజుల క్రితం తన మకాంని చెన్నైకి మార్చిన శ్రీరెడ్డి, 

ఇప్పటికీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కొందరు సినిమా ప్రముఖులపై సెటైరికల్ గా కామెంట్స్ చేస్తూనే ఉంది. ఇక నేడు ఆమె, ఇటీవల టిక్ టాక్ లో తన వెరైటీ డ్యాన్సులతో ఆకట్టుకుంటున్న, ఉప్పల్ బాలుతో కలిసి ఒక సాంగ్ కు డాన్స్ చేస్తూ, ఆ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసింది. ఇటీవల మళ్ళి హైదరాబాద్ వచ్చాను, ఇక్కడికి వచ్చాక బాలుతో కలిసి చేసిన ఫన్నీ వీడియో ఇది, అంటూ ఆమె తన అకౌంట్ లో వీడియో ను పోస్ట్ చేస్తూ తెలిపింది. ప్రస్తుతం ఆమె పెట్టిన వీడియో పోస్ట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: