టాలీవుడ్ అగ్రహీరోలైన సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకు చాలావరకు సమానమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే కొన్ని ఏరియాలలో మహేష్ బాబు ఒకింత, మరికొన్ని ఏరియాల్లో పవన్ కళ్యాణ్ కొంత ముందంజలో ఉంటారు అని అంటున్నారు విశ్లేషకులు. అయితే ఓవర్ ఆల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే మాత్రం, వారిద్దరి సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా సరే వారి క్రేజ్ మాత్రం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గడం ఉండదని అంటున్నారు సినీ విశ్లేషలు. ఇక ఈ ఇద్దరికీ కూడా సినిమా ఇండస్ట్రీలోని కొందరు నటీనటుల్లో ఫ్యాన్స్ ఉన్నారు. 

ముందుగా పవర్ స్టార్ కు వీరాభిమానిగా చెప్పుకునే యంగ్ హీరో నితిన్, మొదటి నుండి అక్కడక్కడా తన సినిమాల్లో పవన్ కు సంబందించిన సన్నివేశాల ద్వారా లేక డైలాగుల ద్వారా పవన్ నామ జపం చేస్తూనే ఉంటాడు. అయితే గత కొద్దిరోజలుగా సరైన సక్సెస్ లేని నితిన్, ప్రస్తుతం మూడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక ప్రస్తుతం చేస్తున్న సినిమాలను ఎంతో జాగ్రత్తగా ఎంచుకున్న నితిన్, వాటిని విజయవంతం అయ్యేలా చేసి, మళ్ళి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఇకపోతే సూపర్ స్టార్ మహేష్ కు వీరాభిమాని అయిన రాజ్ తరుణ్ కూడా మొదటినుండి మహేష్ అంటే తనకు ప్రాణం అని, 

అలానే ఆయన సినిమా కనుక విడుదలైతే, రోజుకు రెండు షోలు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయని తన ఇంటర్వూస్ లో చెప్పడం చూసాం. ఇకపోతే రాజ్ తరుణ్ కూడా గత కొద్దిరోజులుగా సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో ఒక సినిమా చేస్తున్న రాజ్ తరుణ్, ఎలాగైనా ఆ సినిమా ద్వారా మళ్ళి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు. మరి ప్రస్తుతం కెరీర్ పరంగా కొంత సతమతం అవుతున్న ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ లో ఎవరు ఎంతమేరకు విజయాన్ని అందుకుంటారో చూడాలి.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: