కన్నడంలో ‘కిర్రాక్ పార్టీ’మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన రిష్మిక మందన తెలుగు లో నాగశౌర్య హీరోగా నటించిన ‘ఛలో’మూవీలో నటించింది.   ఈ మూవీ మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే.   ఈ మూవీ తర్వాత రష్మికకు తెలుగు లో వరుసగా ఛాన్సులు రావడం మొదలయ్యాయి.  ఈ నేపథ్యంలో పరుశరామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘గీతాగోవిందం’మూవీలో నటించిన రష్మిక మరో బాక్సాఫీస్ హిట్ అందుకుంది.  ఈ మూవీ ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరడం మరో విశేషం.  ఈ మూవీ తర్వాత ‘దేవదాసు’ సినిమాలో నటించినా అది పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. 

తర్వాత తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో నటించింది.  ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ‘డీయర్ కామ్రెడ్’ లో నటించిన రష్మిక మరో సూపర్ హిట్ అందుకుంది.  ఈ మూవీ రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో హిట్ టాక్ తో నడుస్తుంది.  వాస్తవానికి ఈ మూవీ ఏప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.  అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రష్మిక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చాలా ఎమోషనల్ గా మాట్లాడింది. ఈ మూవీ కోసం ఫైట్ చేశామని..ముఖ్యంగా తాను క్రికెట్ ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఎన్నో కష్టాలు పడ్డానని, ఎన్నో దెబ్బలు కూడా తిన్నానని అయినా చేయాలనే ధృడసంకల్పంతో నటించామని అందుకే అనుకున్న సక్సెస్ సాధించగలం అన్న నమ్మకం ఉందని అన్నారు. 

అంతే కాదు హీరోయిన్లు అంటే ఏదో గ్లామర్ గానే భావిస్తారని, కానీ వారికి ఎమోషన్స్ ఉంటాయని..వారికి కష్టాలు ఉంటాయని కొద్ది మందికే తెలుసని అన్నారు.  రష్మిక కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కింది. తాజాగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో రష్మిక మాట్లాడుతూ .. 'డియర్ కామ్రేడ్'కి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది.  ఈ సినిమాకి వచ్చిన రివ్యూలు చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను. విజయ్ దేవరకొండకి .. నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందనీ, నా పాత్రకి న్యాయం చేశానని రాశారు.

నా పాత్రను అలా మలిచిన భరత్ కమ్మ గారికి ఈ క్రెడిట్ దక్కుతుంది. నా పాత్రను .. ఈ సినిమాను ఆదరిస్తోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు  అని చెప్పింది.'డియర్ కామ్రేడ్'కి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందం కలుగుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: