బిగ్ బాస్ కంటెస్టంట్స్ గా హౌజ్ లో ఉన్నంతసేపు బయట ఏం జరుగుతుందో తెలియదు. ఎలిమినేట్ అయ్యాక వచ్చి బయట విషయాలు తెలుసుకుంటారు. అయితే వాళ్లు తెలుసుకోవాల్సిన విషయాల కన్నా వాళ్ల నుండి బిగ్ బాస్ హౌజ్ లో అసలు ఏం జరుగుతుంది అన్నది రాబట్టడానికి న్యూస్ ఛానెల్స్ ఎగబడతాయి. 


ఈ క్రమంలో బిగ్ బాస్ షో గురించి.. హౌజ్ లో రూల్స్ గురించి ఆడియెన్స్ కు తెలియని విషయాలను చెప్పాలని ఎలిమినేటెడ్ సభ్యులు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. బిగ్ బాస్ 1, 2 లలో హౌజ్ నుండి బయటకు రావడం అన్ని న్యూస్ ఛానెల్స్ కు తిరగడం ఈ హంగామా అంతా తెలిసిందే. బిగ్ బాస్ పేరు చెప్పుకుని న్యూస్ ఛానెల్స్ కూడా టి.ఆర్.పి రేటింగ్స్ పెంచుకుంటున్నాయి.


అందుకే బిగ్ బాస్ ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ కు బిగ్ బాస్ షాక్ ఇచ్చాడు. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయ్యాక మొదట ఇంటర్వ్యూస్ స్టార్ మా కే ఇవ్వాలని కండీషన్ పెట్టారట. దీనికోసం రెండో సీజన్ లో చివరి వరకు ఉన్న యాక్టర్ తనీష్ ను యాంకర్ గా పెట్టారట. సో బిగ్ బాస్ షో వల్ల న్యూస్ ఛానెల్స్ రేటింగ్స్ పెంచుకోవడం ఎందుకు అదేదో స్టార్ మానే చేస్తే పోలా అన్న ఆలోచన వచ్చింది.


ఈ సీజన్ బిగ్ బాస్ నిబంధనలలో ఎలిమినేట్ అయ్యాక మొదట ఇంటర్వ్యూ స్టార్ మాకే ఇవ్వాలన్న కండీషన్ కూడా పెట్టారట. మొత్తానికి రెండో సీజన్ ఇచ్చిన షాక్ వల్ల గూగుల్ ఓటింగ్ తీసేయడమే కాకుండా న్యూస్ ఛానెల్స్ చేసే అతిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మొదట స్టార్ మాలో ఇచ్చినా న్యూస్ ఛానెల్స్ వారు చేసే ఇంటర్వ్యూస్.. వారు రాబట్టే సమాచారం వేరేలా ఉంటుందని కొందరి అభిప్రాయం.     



మరింత సమాచారం తెలుసుకోండి: