త‌మ‌న్నా చెల్లిగా `ఎఫ్‌2` చిత్రంలో న‌టించిన మెహ్రిన్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. సీనియ‌ర్ హీరోయిన్‌ స్నేహ చాలా గ్యాప్ త‌ర్వాత ఈ సంవ‌త్స‌రం సంక్రాంతికి విడుద‌ల అయిన‌ `విన‌య విధే రామ‌` సినిమాలో రామ్ చ‌ర‌ణ్‌కు వ‌దిన‌గా న‌టించి అంద‌రిని ఆక‌ట్టుకుంది. అయితే స్నేహ‌- మెహ్రిన్ త్వ‌ర‌లోనే అత్త కోడ‌ళ్లు కాబోతున్నారు. అయితే ఇది నిజ జీవితం కాదండోయ్‌.. వీరిద్ద‌రూ క‌లిసి ఓ సినిమాలో అత్తాకోడ‌ళ్లుగా న‌టించ‌బోతున్నారు. త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ నేడు జ‌న్మ‌దినం సంద‌ర్భంగా తాజాగా న‌టిస్తున్న `ప‌టాస్‌` సినిమా పోస్ట‌ర్ రిలీజ్ చేశారు.


ధనుష్ త‌న నటనతో ప్రేక్షకులను మెప్పించి.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో ధనుష్ క్లీన్ షేవ్, గాగుల్స్ పెట్టుకొని మాస్ లుక్ లో అదిరిపోయారు. అయితే ఈ సినిమాలో ధనుష్ స‌ర‌స‌న స్నేహ‌, మెహ్రిన్ న‌టిస్తున్నారు. ఆర్ ఎస్ సెంథిల్ కుమార్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం అందించ‌బోతున్నారు. అలాగే ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా ధ‌నుష్ రెండు క్యారెక్ట‌ర్‌ల‌లో ఉండ‌బోతున్నార‌ట‌. ఇక తండ్రి పాత్ర‌కు స్నేహ హీరోయిన్‌గా.. కొడుకు పాత్ర‌కు మెహ్రిన్ హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్టు తెలుస్తోంది. 


మ‌రి సీనియ‌ర్ హీరోయిన్ అయిన స్నేహ‌తో యంగ్ హీరోయిన్ మెహ్రీన్ కోడ‌లిగా ఎలా ఢీ కొడుతుంద‌న్న‌ది కాస్త ఆస‌క్తిగానే ఉంది. ధ‌నుష్ ప‌క్క‌న ఈ ఇద్ద‌రు హీరోయిన్ల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అదిరిపోవ‌డం ఖాయం. ఈ చిత్రం సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం వివేక్ మరియు మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అత్త కోడ‌ళ్లుగా స్నేహ‌- మెహ్రిన్ న‌టించ‌బోతున్నారు. మ‌రి వీరిద్ద‌రు అత్త కోడ‌ళ్లుగా న‌ట‌న‌తో ఎలా ఆక‌ట్టుకుంటారో ఈ సినియాలో చూడాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: