మెగాస్టార్ చిరంజీవి హీరోగా 151వ సినిమాగా చేస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమా తెరకెక్కుతుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కొన్నేళ్ల నుండి చిరు ఈ సినిమాపై మనసు పడగా తండ్రి కోరిక తీర్చేందుకు చరణ్ కూడా బడ్జెట్ విషయంలో ఎక్కడ రాజీ పడలేదని సమాచారం.  


అందుకే ఈ సమ్మర్ రిలీజ్ అనుకున్న ఈ సినిమా సెకండ్ హాఫ్ కు వాయిదా పడ్డది. ప్రస్తుతానికి అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేసుకున్న సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా అనుకున్న టైంకు రావడం కష్టమే అంటున్నారు చిత్రయూనిట్ సభ్యులు. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ చాలా ఉంటుందట.   


అది అనుకున్న టైంకు కావడం కాస్త కష్టమని అంటున్నారు. అందుకే రిలీజ్ అనుకున్న అక్టోబర్ 2న సైరా రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే వీటికి సమాధానం దొరకాలంటే మాత్రం ఆగష్టు 22 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆరోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కాబట్టి సినిమా రిలీజ్ డేట్ తో పాటుగా టీజర్, ట్రైలర్ లాంటివి రిలీజ్ చేసే అవకాశం ఉంది.


ఇప్పటికే సైరా నుండి వచ్చిన ఫస్ట్ టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమాను మరో బాహుబలి లాగా ప్రమోట్ చేయాలని చూస్తుంది చిత్రయూనిట్. సూరి డైరక్షన్ టాలెంట్.. చిరు నటనా ప్రతిభ కలిసి ఈ సినిమాను ఏ రేంజ్ కు తీసుకెళ్లనున్నాయో చూడాలి. పరుచూరి బ్రదర్స్ కథ అందించిన ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్ర మాటలను అందిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: