బిగ్ బాస్ సీజన్ 3లో హాట్ కపుల్ గా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చారు వరుణ్ సందేశ్, వితిక. ముందు రెండు సీజన్లలో ఇలా కపుల్స్ ను పంపించింది లేదు. కాని ఈసారి బిగ్ బాస్ కొత్తగా మ్యారేజ్ కపుల్ ను లోపలకు పంపించాడు. బహుశా షోకి కావాల్సిన రొమాంటిక్ స్టఫ్ ఇస్తారని భావించి వాళ్లిద్దరిని హౌజ్ లోకి పంపించొచ్చు. అది పక్కన పెడితే వరుణ్, వితిక ఇద్దరు ఏ పనిచేసినా కలిసి చేస్తున్నారు. 


వితిక అయితే వరుణ్ సపోర్ట్ తోనే హౌజ్ లో నెట్టుకొస్తుంది. లాస్ట్ వీక్ నామినేషన్ లో వితిక బయటకు వస్తుందని అందరు భావించారు. లక్కీగా హేమ ఎలిమినేట్ అయ్యింది. ఇక ఈ వారం కూడా వరుణ్, వితిక ఇద్దరు నామినేషన్ లో ఉన్నారు. బిగ్ బాస్ కు ఈ జంట సెలెక్ట్ అయినప్పుడు ఇద్దరుగా వెళ్లిన తాము ముగ్గురుగా వస్తామని ఇంటర్వ్యూస్ లో చెప్పారు.


ఇద్దరుగా వెళ్లడం వరకు ఓకే కాని ముగ్గురుగా రావడం ఏంటని అనుకోవచ్చు. ఆ మూడో వ్యక్తి ఎవరు అంటే తమ స్నేహితుడని అన్నారు V అండ్ V. హౌజ్ లో తమ మనసుకి నచ్చే ఓ మంచి స్నేహితుడు లేదా స్నేహితురాలిని తీసుకు రావాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు వరుణ్, వితిక. అలానే ఇంటి సభ్యులంతా ఈ జంటపై ప్రేమ చూపిస్తున్నారు. అయితే లాస్ట్ వీక్ మహేష్, వితికల గొడవలో వరుణ్ సందేశ్ కాస్త నెమ్మదిగా ప్రవర్తించి ఉంటే బాగుండేది అంటున్నారు. 


ఇప్పుడు ఉన్న 15 మంది కంటెస్టంట్స్ లో హీరో ఇమేజ్ ఉంది ఒక్క వరుణ్ సందేశ్ కు మాత్రమే. మిగతా వాళ్లంతా సీరియల్ యాక్టర్స్, యాంకర్స్ మాత్రమే కొద్దిగా ఓపికగా ఉంటే కచ్చితంగా వరుణ్ కు తెలుగు ఆడియెన్స్ సపోర్ట్ దొరుకుతుంది. మరి వరుణ్, వితిక చెప్పినట్టుగా వెళ్లేప్పుడు మూడవ వ్యక్తితో వెళ్తారా లేదా అన్నది చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: