షకీలా ఒకప్పుడు సాఫ్ట్ పోర్న్ సినిమాలతో మలయాళం ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది. ఎంతలా అంటే పెద్ద హీరోల సినిమాలు కూడా షకీలా సినిమాల వస్తున్నాయంటే భయపడేంతగా. అయితే ఈమె చాలా ఏళ్ల తరువాత తెలుగు సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించబోతుంది. సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న కొబ్బరి మట్ట గురించి మనకు తెలిసిందే. ఈ సినిమాలో హీరో సంపూర్ణేష్ కు తల్లిగా నటించనున్నది. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ వచ్చింది. ఈ సినిమాలో షకీలా కు భర్తగా కత్తి మహేష్ నటించబోతున్నాడని, చిన్న చిన్న రొమాన్స్ ఉండబోతుందని తెలుస్తుంది. 


అయితే రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగులు స్టీవెన్ శంకర్ అందించారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా.. ఇందులో 3.27 నిమిషాల భారీ డైలాగ్‌ను సింగిల్ టేక్‌లో చెప్పి ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు సంపూర్ణేష్ బాబు. స్టార్ హీరోలకు సైతం వరుణుపుట్టేలా.. ప్రపంచ సినీ చరిత్రలోనే ఇప్పటి వరకు ఎవరూ చెప్పనంత పెద్ద డైలాగును సింగిల్ టేక్‌లో చెప్పి సంపూ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. ఈ డైలాగ్ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. 



ఆండ్రాయిడు పేరిట విడుదలైన ఈ కొబ్బరి మట్ట తాజా ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలాఉంటే .. కత్తి మహేష్‌‌కి పెయిర్‌గా నటించడంపై స్పందించారు షకీలా.. ‘కొబ్బరిమట్ట’ సినిమాలో కత్తి మహేష్ ఎవరన్నది నాకు తెలియదు. ఇప్పుడు అతను ఎంత కాంట్రవర్శీ కింగ్.. అన్నది విన్నాను. ఇక కొబ్బరి మట్ట సినిమా చేస్తున్నప్పుడు ఇతను సంపూర్ణేష్ బాబు.. సినిమాలో హీరో ఇతనే అని పరిచయం చేశారు. నేను వెంటనే.. వాట్ ? హీరోనా ? అనేశాను’ అంటూ పెదవి విరిచారు షకీలా. 

మరింత సమాచారం తెలుసుకోండి: