దేశవ్యాప్తంగా పలు భాషల్లో అప్పట్లో కొన్నేళ్లపాటు తన ఆకట్టుకునే అందం, నటనతో అద్భుతనటిగా సినిమా ప్రపంచాన్ని ఏలిన దివంగత దిగ్గజ నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్, దఢక్ సినిమాతో బాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలి చిత్రమే ఆమెకు మంచి పేరు తీసుకువచ్చింది. ఆ సినిమా విజయంతో ప్రస్తుతం మెల్లగా ఒక్కక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్న జాన్వీ పై నేడు బాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఆమె కొద్దిరోజలుగా లవ్ ఉన్నట్లు కొన్ని వర్గాల కథనం. ఇక వారు చెప్తున్న వివరాల ప్రకారం, 

గత కొద్దిరోజలుగా జాన్వీ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పలు రెస్టారెంట్స్ మరియు షాపింగ్ మాల్స్ లో సందడి చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే వారిద్దరూ ఎవరి కంటా పడకుండా ఇప్పటివరకు జాగ్రత్తపడ్డప్పటికీ, నేడు అనుకోకుండా నేడు మీడియాకు దొరికిపోయారని అంటున్నారు. వాస్తవానికి ఈ విషయమై ఇప్పటివరకు ఎక్కడా కూడా అధికారికంగా సమాచారం లేనప్పటికీ, ఈ వార్త పలు విధాలుగా ప్రచారం అవుతోంది. అయితే ఈ వార్త విన్న కొందరు జాన్వీ అభిమానులు, బాబోయ్ మా హీరోయిన్ అంతపని చేసిందా అంటూ నోరెళ్లబెడుతున్నారట. అయితే వారిలో కొందరు మాత్రం, ఓవైపు మరికొందరు హీరోయిన్లు బహిరంగంగానే తమ బాయ్ ఫ్రెండ్స్ తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటే అది పెద్దగా పట్టించుకోని మీడియావారు, 

నేడు లేనిపోని విధంగా జాన్వీ పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని మండిపడుతూ, సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. అయితే జాన్వీ లవ్ అఫైర్ విషయమై ఎప్పటినుండో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని, అటువంటివాటిలో ఇది కూడా ఒకటని, కాబట్టి వీటిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని ఆమె సన్నిహితులు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో సంచలనం రేపుతున్న ఈ వార్తలో నిజానిజాలు తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఆగవలసిందే.....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: