కిడ్నాపర్ చెర నుంచి బయటపడ్డ సోనీతోపాటు పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇస్తున్నారు సీసీఎస్ పోలీసులు. ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ సమక్షంలో బాధితురాలి స్టేట్ మెంట్ ను రికార్డు చేస్తున్నారు పోలీసులు. మరో వైపు నిందితుడు రవిశేఖర్ నేర చరిత్రపై కూడా ఆరా తీస్తున్నారు పోలీసులు. అతని పై మొత్తం 25 కేసులు ఉన్నట్లుగా తెలుస్తుంది. బీ ఫార్మసీ విద్యార్థిని సోనీని కిడ్నాప్ చేసిన నిందితుడు రవిశేఖర్ ను పోలీసులు ఒంగోలులో అదుపులోకి తీసుకున్నారు. అతనిపై తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం 4 రాష్ట్రాల్లో కేసులున్నాయి.

వారం రోజుల క్రితం హైదరాబాద్ లోని హయత్ నగర్ లో కిడ్నాప్ చేసిన సోనిని అద్దంకి దగ్గర వదిలేశాడు రవిశేఖర్. హైదరాబాద్ నుంచి అనంతపురం, కర్నూలు, తిరుపతి మీదుగా అద్దంకి తీసుకొచ్చి అక్కడ వదిలి వెళ్లాడు.దీంతో అద్దంకి నుంచి హైదరాబాద్ లోని ఇమ్లీబన్ బస్టాండ్ కు చేరుకుంది బాధితురాలు సోని. దీంతో బాధితురాలికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు పోలీసులు. ఉద్యోగం కోసమే తాను తిరుపతికి వెళ్లానని చెబుతుంది సోని, స్నేహితురాలు మౌనిక ఉదయం 5 గంటల 30 నిమిషాలకు ఇమ్లీబన్ బస్ స్టాప్ లో సోనిని చూసింది మౌనిక దీంతో వెంటనే సోనీ పేరెంట్స్ కి కాల్ చేసింది. పేరెంట్స్ పోలీసులకి ఉద్యోగం కోసమే తిరుపతికి వెళ్లినట్లుగా సోనీ తనతో చెప్పిందంటుంది మౌనిక.

మౌనిక మార్నింగ్ 5:30 కి తనని నేను బస్టాప్ లో చూశాను అని చెప్తుంది.అయితే ఎక్కడికెళ్తున్నావు అని అడిగితే ఇంటికెళ్తున్న అని చెప్పింది. ఎక్కడ నుంచి వస్తున్నావు అంటే అద్దంకి లో బస్సెక్కినా అని చెప్పింది. మరి పేరెంట్స్ కి కాల్ చేసినావా అంటే చేయలేదు అని చెప్పింది. నెంబర్ తీసుకొని కాల్ చేసిన వాళ్ళ పేరెంట్స్ కి ఎక్కడికెళ్లినావు అని అడిగితే జాబ్ పర్పస్ లో వెళ్ళిన ఇట్లా సైన్ కోసం సర్టిఫికేట్ కోసం వెళ్లిన అని చెప్పింది. వాళ్ల పేరెంట్స్ తో నేనే మాట్లాడిన వాళ్ల పేరెంట్స్ ఉండే అక్కడే ఉండు నేను వచ్చే వరకు అని చెప్పారు.సరె అని అక్కడే ఉన్నాము. పోలీసులు వచ్చేంతవరకు అక్కడే ఉన్నాము. తరువాత వాళ్ళు తీసుకొని వెళ్ళారు. ఎక్కడెక్కడకి వెళ్ళినావు అంటే ఓన్లీ తిరుపతి ఒక్కటే చెప్పింది ఆ అమ్మాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: