రీల్ లైఫ్ లో ప్రేమ కోసం ఎన్నో చేసే హీరోలు రియల్ లైఫ్ లో ఏం చేస్తారు. ఏం వారు మాత్రం మనుషులు కారా వారికి మాత్రం మనసు ఉండదా అనుకోవచ్చు. హీరోలైనంత మాత్రానా వాళ్లకి లవ్ స్టోరీస్ ఉండవని అనుకోడానికి లేదు. ఇటీవల ఓ యువ హీరో తన లవర్ కోసం గుండుకొట్టించుకున్న సందర్భాన్ని ప్రస్థావించాడు. ఏంటి ప్రేమించిన అమ్మాయి కోసం గుండు కొట్టించుకున్నాడా ఎవరా హీరో అని అనుకోవచ్చు.. ఆ హీరో ఎవరో కాదు మన ఆరెక్స్ 100 హీరో కార్తికేయ అని తెలుస్తుంది. 


ఆరెక్స్ 100 సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న కార్తికేయ ఆ సినిమా తర్వాత హిప్పి అంటూ ఓ ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఇక ఇప్పుడు గుణ 369 అంటూ ఓ క్రేజీ లవ్ స్టోరీతో వస్తున్నాడు కార్తికేయ. ఆగష్టు 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ సీనియర్ కమెడియన్ నడిపించే టాక్ షోలో పాల్గొన్నాడు ఆ టాక్ షోలో భాగంగా కార్తికేయ ఓ అమ్మాయి కోసం గుండు కొట్టించుకున్నాడని తెలిసింది. 


తను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఆమెను ఇష్టపడ్డ కార్తికేయ ఆమెకు జ్వరం వచ్చిందని అది తగ్గితే తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకుంటానని మొక్కుకున్నాడట. ఈ విషయం ఆ సీనియర్ కమెడియన్ కు ఎలా తెలిసిందో ఏమో కాని ఆ ప్రశ్న అడిగే సరికి కార్తికేయ ముఖంలో ఏదో తెలియని కన్ ఫ్యూజన్. 


గుణ 369 లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆరెక్స్ 100 తర్వాత కార్తికేయకు క్రేజ్ తెచ్చిన సినిమాగా ప్రచార చిత్రాల్లో జోష్ కనబరుస్తుంది ఈ సినిమా. మరి ఆఫ్టర్ రిలీజ్ కూడా ఈ సినిమా హంగామా ఇలానే ఉంటుందా లేదా అన్నది చూడాలి.
  


మరింత సమాచారం తెలుసుకోండి: