ఎంట్రీ ఇచ్చిన ఉన్నత పోజీషన్లోకి వెళ్లిన వారు చాలా మంది ఉన్నారు.  తాజాగా బాబా భాస్కర్ మాస్టర్ తెలుగు లో వస్తున్న ‘బిగ్ బాస్ 3 ’ లో ఇంటి  సభ్యులుగా వచ్చిన విషయం తెలిసిందే. అంతకు ముందు భాబా మాస్టర్ ఎన్నో టివి ప్రోగ్రామ్స్ లో కనిపించారు. ముఖ్యంగా తెలుగు బుల్లితెరపై వచ్చే ఢీ డ్యాన్స్ షోలో బాబా మాస్టర్ తనదైన మార్క్ చాటుకున్నారు. 

బాబా భాస్కర్ బిగ్ బాస్ లోకి రాక ముందు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ తాజాగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇందులో భాగంగా యాంకర్ ఉదయభాను గురించి భాస్కర్‌ను ఓ ప్రశ్న అడిగాడు. అప్పట్లో ఓ యాంకర్ కోసం మీరు స్టూడియోలు చుట్టూ తిరిగేవారట.. ఎవరా యాంకర్? అని అడిగారు యాంకర్. 

అయితే అబ్బే అలాంటిది ఏమీ లేదని..ఈ విషయంలో తనను చాలా మంది అపార్థం చేసుకున్నారు. ఉదయ్ భాను, తాను కలిసి ఢీ2 షోకి యాంకరింగ్ చేశామని.. దాంతో కొంతమంది లేనిపోనివి అనుకునేవాళ్లని చెప్పారు. కానీ తమ మధ్య అలాంటిదేమి లేదని స్పష్టం చేశారు.ఉదయ్ భాను,తాను గాడ్&డెవిల్‌లా ఉండేవారమని చెప్పారు. ఉదయ్ భాను డెవిల్ అయితే తాను గాడ్ అని చెప్పారు. అయితే ఢీ-2 షోలో తనకు, ఉదయ్ భానుకు మధ్య జరిగే సరదా గొడవలను తన భార్య మరోలా అర్థం చేసుకునేదని భాస్కర్ అన్నారు.

ఈ విషయంపై తన భార్య కూడా తనను ప్రశ్నించిందని..ఎందుకు ఆ అమ్మాయితో ఎక్కువ సన్నిహితంగా ఉంటావని..చేతులు పట్టుకుంటావు..దగ్గరగా ఉంటావని అడిగిందని అది డ్యాన్స్ షో కాబట్టి.. ఇద్దరం డ్యాన్స్ చేసేటప్పుడు సాధారణంగా చేతులు పట్టుకునేవాళ్లమని చెప్పారు. దాన్ని కూడా తప్పుగా అర్థం చేసుకుంటే ఎలా అన్నారు. అయితే ఆ అమ్మాయి కాస్త ఓవర్ చేస్తుంది చూసేవాళ్లు కూడా అపార్థం చేసుకుంటారని నా భార్య హెచ్చరించిందని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: