ఈమధ్య బాలీవుడ్ చిత్రం 'ప్రస్థానం' టీజర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.  తెలుగులో సూపర్ హిట్ అయిన 'ప్రస్థానం'(2010) రీమేక్ ఇది. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన దేవా కట్టానే ఈ రీమేక్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ  సినిమాలో సంజయ్ దత్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.  సంజయ్ ఎస్.దత్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సంజయ్ సతీమణి మాన్యత దత్ నిర్మిస్తున్నారు.  టీజర్ రిలీజ్ కి వెంటనే దానికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది బాలీవుడ్నుంచి. దాదా ఐస్ బ్యాక్ అంటూ, సంజయ్ దుత్త లుక్ నుంచి కాస్ట్యూమ్స్ దాక ప్రతి ఒక్క విషయాన్నీ పబ్లిక్ బాగా ఆదరించారు, ఈ సంతోషాన్ని ప్రస్థానం టీం ఆస్వాదించకముందే ఈ సినిమా టీమ్ ఇప్పుడు లీగల్ సమస్యల్లో చిక్కుకుంది అంట.


ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ షీమారూ ఎంటర్టైన్మెంట్స్ లిమిటెడ్ వారు 'ప్రస్థానం' హిందీ రీమేక్ రైట్స్ తమ వద్ద ఉన్నాయని..తమ అనుమతి లేకుండా రిమేక్ చేయడం అక్రమం అని వాదిస్తున్నారు.  ఈ విషయాన్ని గతంలోనే సంజయ్ దత్ కు తెలిపామని.. కానీ అదేమీ పట్టించుకోకుండా 'ప్రస్థానం' సినిమాను రీమేక్ చేశారని.. అందుకే లీగల్ నోటీసు ఇవ్వాల్సి వచ్చిందని షీమారు ఎంటర్టైన్మెంట్స్ ప్రతినిథి తెలిపారు.


అయితే ఈ లీగల్ నోటీసు వ్యవహారంపై అటు సంజయ్.. మాన్యత కానీ.. ఇటు డైరెక్టర్ దేవా కట్టా కానీ ఇంతవరకూ స్పందించలేదు. ఇప్పటికే ఈ సినిమా విడుదలలో చాలా జాప్యం జరిగింది.  అంతా సెట్ అయిందని.. ఈ సినిమాను సెప్టెంబర్ 20 న విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకున్న టైమ్ లో ఈ కొత్త వివాదం వచ్చిపడింది.  మరి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: