చాలామంది హీరోలు వ్యాపారాలు చేయడం కొత్తేమి కాదు. రెస్టారెంట్స్, జువెల్లరీ షాప్స్, ఫిట్ నెస్ సెంటర్స్, వెబ్ సైట్స్..ఇలా రకరకాల వ్యాపారాలు చేస్తూ సైడ్ బిజినెస్ తో బాగా సంపాదిస్తున్నారు. ఐతే నేటి తరం స్టార్ హీరోలు వరుసగా బట్టల వ్యాపారంలోకి దిగుతూ కొత్త ట్రెండ్ ని సెట్ చేస్తున్నారు.. విజయ్ దేవరకొండ, ఛార్మి కౌర్, మహేష్, అల్లు అర్జున్..ఇలా వరుసబెట్టి అందరు హీరోలు గార్మెంట్స్ బ్రాండ్స్ మొదలుపెట్టారు. టాలీవుడ్ హీరోలకి ఈ కొత్త ట్రెండ్ బాగానే వర్కౌట్ అవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కంటే ఇదే బెటరని కూడా చాలామంది ఫీలింగ్.  

అసలైతే ఈ ట్రెండ్ ని బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ మొదలుపెట్టారు. 'బీయింగ్ హ్యూమన్' పేరుతో ఆయన స్టార్ట్ చేసిన బ్రాండ్ బాగా సక్సెస్ అయ్యింది. టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరో ప్రాంచైజ్ తో కలిసి 'రౌడీ' పేరుతో ఓ గార్మెంట్ బ్రాండ్ ని నడుపుతున్నాడు. ప్రెసెంట్ విజయ్ కి యూత్ లో ఉన్న పాపులారీటి కారణంగా ఈ బ్రాండ్ బాగానే సాగుతుంది. అలాగే వేదికలపై విజయ్ ఈ బ్రాండ్ బట్టలు ధరించి వాటికి ప్రచారం కల్పిస్తూ కూడా ఉంటాడన్న విషయం అందరికి తెలిసిందే. ఇక రీసెంట్‌గా పూరితో కలిసి ఛార్మి కూడా 'బి ఇస్మార్ట్' పేరుతో ఓ ఆన్లైన్ గార్మెంట్స్ స్టోర్ స్టార్ట్ చేశారు. ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత ఈ స్టోర్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక సూపర్ స్టార్ మహేష్ రీసెంట్‌గా 'ది హుంబుల్ కో ' బ్రాండ్ నేమ్ తో అప్పెరల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. ఆగస్టు 7న ఘనంగా ఈ బ్రాండ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉండాగానే తాజాగా మరో స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ఓ గార్మెంట్ బ్రాండ్ వ్యాపారం మొదలుపెట్టనున్నారని లేటెస్ట్ అప్‌డేట్. ఇలా స్టార్ హీరో లు ప్రజల్లో తమకు ఉన్న ఆదరణను తెలివిగా వ్యాపారం కోసం బాగా ఉపయోగించుకుంటున్నారు. తమ హీరో కోసం ఏమైనా చేసే అభిమానులున్న కారణంగా ఆ స్టార్స్ కి చెందిన ప్రొడక్ట్స్ ఎగబడి కొంటారనడంలో సందేహం లేదు. ఇక సందీప్ కిషన్ లాంటి యంగ్ హీరోస్ కూడా సైడ్  బిజినెస్ తో బిజీగానే ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: