సన్నీలియోన్ ఈ  పేరు తెలియని భారతీయుడు ఉండవు.  ఆమె సినిమా రిలీజ్ అవుతుంది అంటే... థియేటర్ల ముందు జనాలు పెద్ద క్యూ ఉంటుంది.  పెద్దల సినిమా నుంచి బాలీవుడ్ కు అడుగుపెట్టింది.  బాలీవుడ్ లోకి వచ్చిన తరువాత మొదట్లో  చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తరువాత పెద్ద హీరోలు ఆమెతో సినిమాలు చేసేందుకు అంగీకరించారు.  బాలీవుడ్ లోప్రస్తుతం అనేక సినిమాలు చేస్తున్నది సన్నిలియోన్.  రీసెంట్ గా ఈ హీరోయిన్ అర్జున్ పాటియాల సినిమా చేసింది.  ఈ సినిమకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
  
ఇందులో సన్నీలియోన్ ఓ ఫోన్ నెంబర్ చెప్తుంది.  ఆ నెంబర్ తనదే అని చెప్పడంతో.. సినిమా చూసిన ప్రేక్షకులు ఆ నెంబర్ కు ఫోన్ చేయడం స్టార్ట్ చేశారు.  సినిమా రిలీజైన దగ్గరి నుంచి వేలసంఖ్యలో ఆ నెంబర్ కు కాల్స్ వెళ్తున్నాయట.  అసలు ఆ ఫోన్ నెంబర్ ఎవరిది.  అది నిజమైన నెంబరేనా లేదంటే డమ్మీ నెంబరా అంటే నెంబర్ నిజమే కానీ.. ఆ నెంబర్ సన్నీలియోన్ నెంబర్ కాదు.  


ఢిల్లీకి చెందిన పునీత్ అగర్వాల్ అనే చిరు వ్యాపారి నెంబర్ అది.  అర్జున్ పాటియాలా సినిమా రిలీజైనప్పటి నుంచి అతనికి వేలాది ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి.  సన్నీలియోన్ తో మాట్లాడని, కోరుతూ మెసేజ్ లు ఫోన్ కాల్స్ చేస్తున్నారట.  కొందరైతే డబ్బు కూడా అఫర్ చేస్తున్నారని పునీత్ వాపోయాడు.  ఫోన్ కాల్స్ బాధను భరించలేక అర్జున్ పాటియాలా యూనిట్ పై కేసు ఫైల్ చేశారట.  


తన వ్యాపారం అంతా లాస్ అయ్యానని చివరకు తనకు సరైన నిద్ర పట్టడం లేదని పునీత్ అగర్వాల్ పేర్కొన్నాడు.  సినిమాలో ఫొన్ నెంబర్లు ఎవరివి పడితే వాళ్ళవి ఇస్తే ఎలా అని, గత 12 సంవత్సరాలుగా తాను ఆ ఫొన్ నెంబర్ వాడుతున్నానని, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి తనను మనసికంగా హింసిస్తున్నారని పునిత్ తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: