టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత లలో ఒకరు దిల్ రాజు. ఈయన గతంలో ఎప్పుడూ కూడా కుటుంబ కథా చిత్రాలను మరియు క్లాసికల్ ప్రేమకథా చిత్రాలను మాత్రమే నిర్మించేవారు. అయితే రాను రాను ప్రేక్షకుల ఆలోచనలలో మార్పులు రావటంతో తాజాగా ఇటీవల దిల్ రాజు కూడా ప్రేక్షకుల ఆలోచనలకు తగ్గ విధంగానే సినిమాలు నిర్మించడానికి తన నిర్ణయాలను మార్చుకుని మా సినిమాలను అలాగే కొత్తదనం స్టోరీ ఉన్న సినిమాలను నిర్మిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో వచ్చే హీరోలు చాలా వరకు ఇండస్ట్రీ లో మంచి పేరు సంపాదించుకుంటారు.


సినిమా ఓకే చేసిన తరువాత నుండి డబ్బులు పెట్టడం మాత్రమే కాక సినిమాలు ఏ విధంగా ప్రజలలో బలంగా తీసుకెళ్లాలో బయట మార్కెట్ ని ఏవిధంగా క్యాష్ చేసుకోవాలి వంటి విషయాలలో చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ అద్భుతంగా సినిమాని రిలీజ్ చేయడంలో సిద్ధహస్తుడు దిల్ రాజు అని చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు కామెంట్ చేస్తున్నారు. ఇంతటి పేరు ఉన్న దిల్ రాజు గురించి ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరో ఆయన పేరు చెబితేనే తప్పించుకుంటున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


తప్పించుకుంటున్న హీరోలలో ప్రథమంగా ముందు వరుసలో ఉన్నది విజయ్ దేవరకొండ అని ఇండస్ట్రీలో టాక్. విషయంలోకి వెళితే విజయ్ దేవరకొండ తో సినిమా చేయడానికి దిల్ రాజు ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్నాడట..అయితే కారణం తెలియదుగానీ ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండ దిల్ రాజుతో సినిమా అంటేనే పెద్దగా పట్టించుకోనటూ...తర్వాత తర్వాత అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఫిలిం నగర్ లో వినపడుతున్న సమాచారం. ఇదే వరుసలో నాగచైతన్య కూడా ఉన్నాడని టాక్ వినపడుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: