బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఆరు సంవత్సరాలైంది. ఈ ఆరు సంవత్సరాల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఆరు సినిమాల్లో నటించినా ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. స్టార్ హీరోయిన్లతో నటించినా, స్టార్ డైరెక్టర్లు డైరెక్షన్ చేసినా బెల్లంకొండకు హిట్ ఇవ్వలేకపోయారు. రేపు బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ఏడవ సినిమా రాక్షసుడు విడుదల కాబోతుంది. ఈ సినిమాకు బాలీవుడ్ బయ్యర్ నుండి సమస్య వచ్చినట్లు తెలుస్తుంది. 
 
నిజానికి బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలను నిర్మాతలు భారీ బడ్జెట్తో నిర్మించడానికి బాలీవుడ్ మార్కెట్ కూడా ఒక కారణం. బాలీవుడ్ ప్రేక్షకులకు టాలీవుడ్ మాస్ సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. తెలుగులో యావరేజ్ గా ఆడిన ఎన్నో సినిమాలు కూడా యుట్యూబ్లో హిందీ భాషలో రికార్డ్ వ్యూస్ సాధించాయి. బెల్లంకొండ శ్రీనివాస్ కూడా కవచం సినిమా వరకు మాస్ సినిమాల్లోనే నటించాడు. 
 
అందువలన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలంటే బాలీవుడ్ మార్కెట్ ఆసక్తి చూపించేది. కానీ మాస్ సినిమాలు తీస్తున్నా హిట్ రాకపోవడంతో బెల్లంకొండ శ్రీనివాస్ రూట్ మార్చాడు. మాస్ సినిమాలకు దూరంగా కొత్త కథలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు ఈ హీరో. శ్రీనివాస్ నటించిన సీత సినిమాలో ఫైట్లు తక్కువగా ఉండటంతో విడుదల సమయంలో సీత సినిమా రైట్స్ కొన్న బాలీవుడ్ బయ్యర్ ఇవ్వాల్సిన అమౌంట్ కంటే రెండు కోట్ల రుపాయలు తక్కువ కట్టాడట. 
 
ప్రస్తుతం శ్రీనివాస్ నటిస్తున్న రాక్షసుడు సినిమా కూడా థ్రిల్లర్ కథాంశంతో తీసిన సినిమా కావడంతో ఈ సినిమా హక్కులు శ్రీనివాస్ గత సినిమాలతో పోలిస్తే తక్కువ మొత్తానికే ఇవ్వాలని బాలీవుడ్ బయ్యర్ అడిగాడని సమాచారం. రాక్షసుడు సినిమా తమిళ సినిమా 'రాట్చసన్ ' సినిమాకు రీమేక్. బెల్లంకొండ శ్రీనివాస్ కు జోడీగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. రమేశ్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: