యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఒక వెలుగు వెలిగిన రాజశేఖర్ ను ఒక సామాన్య మహిళ సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించిన ఒక సంఘటన లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చింది. భాగ్యనగరం ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు చాల కఠినంగా వ్యవహరిస్తున్నారు. 

దీనితో చాల చోట్ల తనికీలు చేస్తూ విపరీతంగా చలాన్లు రాస్తున్నారు. ఈ పరిస్థుతులలో పోలీసులు సెలెబ్రెటీల నుండి సామాన్యుల వరకు ఎవర్నీ వదలడం లేదు. ఈవిషయమై ఒక ఆంగ్ల దినపత్రిక కథనం రాస్తూ పోలీసులు సామాన్యుల నుండి వెంటనే అపరాధ రుసుమును వసూలు చేస్తున్నారు కానీ ఇంకా చాలామంది సెలెబ్రెటీలు ఇలాంటి పోలీసు ఫైన్స్ కట్టవలసి ఉంది అంటూ ఒక జాబితా ప్రకటించి అందులో హీరో రాజశేఖర్ పేరు కూడ ఆపత్రిక పేర్కొంది. 

ఈవిషయాన్ని పరిశీలించిన రమ్యశ్రీ అనే మహిళ ఈవిషయం పై స్పందిస్తూ పోలీసు చలాన్లు కట్టవలసిన బాధ్యత ఒక సామాన్యులకేనా సెలెబ్రెటీలకు ఉండదా అంటూ సోషల్ మీడియాలో రాజశేఖర్ ను కార్నర్ చేస్తూ ట్విట్ చేసింది. దీనిపై రాజశేఖర్ వెంటనే స్పందిస్తూ తాను కట్టవలసిన 18 వేల రూపాయల చలాన్లు ఇప్పటికే కట్టేసాను అంటూ తాను ఫైన్ కట్టిన రశీదులు ఆమెకు తెలిసేలా షేర్ చేసాడు.

అంతేకాదు తాను బాధ్యతగల పౌరుడుని అని చెపుతూ ఇప్పుడే కాదు భవిష్యత్ లో కూడ తనకు ఎప్పుడు ట్రాఫిక్ ఫైన్స్ పడినా వెంటనే కడతాను అంటూ తన ట్విటర్ లో అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఇప్పుడు ఆ ట్విట్ పై చాలామంది ప్రశంసలు కురిపిస్తుంటే మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. భవిష్యత్ లో కూడ ఫైన్స్ కడతాను అంటే రాజశేఖర్ రానున్న రోజులలో కూడ ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోడా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. అంతేకాదు యాంగ్రీ హీరోకు ఇవేమి అలవాట్లు అంటూ సెటైర్లు కూడ వేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: