టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  డ్యాన్స్, ఫైట్స్ తో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న ఈ కుర్ర హీరో బ్యాడ్ లక్ ఆ తర్వాత వచ్చిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడుతున్నాయి.  దాంతో కెరీర్ కష్టాల్లో ఉన్న ఎలాంటి ఇబ్బంది పడకుండా తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్.  కెరీర్ లో హిట్ సినిమాలు లేకపోయినా వరుస ఆఫర్లతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ బిజీ బిజీగా ఉన్నాడు.


ఆయన తాజాగా నటించిన 'సీత' సినిమా దారుణ పరాజయాన్ని చవి చూసింది. ఎలాగైనా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో తమిళ హిట్ మూవీ రీమేక్ లో నటించేందు కు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా.. హవీష్ ప్రొడక్షన్, ఏ స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ సమర్పణలో.. సత్యనారాయణ కోనేరు నిర్మించగా.. రమేష్ వర్మ పెన్మెత్స డైరెక్ట్ చేసిన థ్రిల్లర్ మూవీ.. రాక్షసుడు.. (హోల్డ్ యువర్ బ్రీత్).. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన రాక్షసన్ మూవీకిది తెలుగు రీమేక్.


రాక్షసుడు టీజర్, ట్రైలర్ అండ్ ఆడియోకి మంచి స్పందన వచ్చింది. ఆడియన్స్‌ని అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే విధంగా.. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే తో తెరకెక్కిన రాక్షసుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటాడని సెన్సార్ సభ్యులు చెప్పారు. జూలై 30వ తేది సాయంత్రం.. హైదరాబాద్ ఫిలింనగర్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో రాక్షసుడు ప్రీ-రిలీజ్ వేడుక గ్రాండ్‌గా జరుగనుంది. ఈ సినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని… ‘U/A ‘ సర్టిఫికెట్ పొందింది. ఇకపోతే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 2న విడుదల కానుంది.  


విడుదలకు తేదీ దగ్గర పడటంతో ఈ సినిమా పై ప్రమోషన్ ఎక్కువగా చేస్తున్నారు చిత్ర యూనిట్.  శరవణన్, రాజీవ్ కానకాల, కాశీ విశ్వనాథ్, బేబీ దువా తదితరులు నటించిన రాక్షసుడు ఆగస్టు 2న రిలీజ్ కానుంది. కెమెరా : వెంకట్ సి.దిలీప్, సంగీతం : గిబ్రాన్, డైలాగ్స్ : విద్యా సాగర్, యాక్షన్ : రామ్ లక్ష్మణ్, విక్కీ మాస్టర్, వెంకట్.

మరింత సమాచారం తెలుసుకోండి: