దాదాపు రిలీజ్ కు నెల ముందే భారీ ప్రమోషన్స్‌తో భారీ హైప్‌తో ఒకేసారి నాలుగు భాషల్లో ఎంతో గ్రాండ్‌గా విడుదలైన డియర్ కామ్రేడ్‌కి మిక్స్డ్ టాక్ వచ్చినా.. విజయ్ దేవరకొండ గత సినిమాలకున్న క్రేజ్‌తో నిర్మాతలు సేఫే, ఫస్ట్ వీక్‌లోనే పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తారుమారయ్యాయి. ఫస్ట్ వీకెండ్‌లో ఫర్వాలేదనిపించిన కామ్రేడ్ కలెక్షన్లు వీక్ డేస్‌లో వీకైపోయాయి..ఈ విషయం సోమ, మంగళ, బుధవారాల్లో వసూళ్లు చూస్తే తెలుస్తుంది. ఇక డియర్ కామ్రేడ్ కన్నా వారం ముందు విడుదలైన ఇస్మార్ట్ శంకర్ జోరు మాత్రం అసలు తగ్గలేదు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఇస్మార్ట్ శంకర్ మొదటి రోజు యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్నప్పటికీ..ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అన్న టాక్ తో కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్‌కి చేరిన ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్స్.. దర్శకుడు పూరి, ఛార్మి, హీరోయిన్ నిధి చేసే భారీ ప్రమోషన్స్‌తో సెకండ్ వీక్ లోను డియర్ కామ్రేడ్‌ని పక్కన పెట్టి మంచి కలెక్షన్స్‌ని సాధిస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే డియర్ కామ్రేడ్ విడుదలకు ముందు విజయ్ దేవరకొండ, రష్మిక చేసిన ప్రమోషన్స్‌తో పోలిస్తే ఇస్మార్ట్ విడుదలకు ముందు ప్రమోషన్స్ చాలా వీక్‌ అని చెప్పాలి. 

కానీ ఇస్మార్ట్ శంకర్ విడుదలయ్యాక పూరి అండ్ కో చేసే ప్రమోషన్స్‌తో ఇస్మార్ట్ మీద భారీగా క్రేజ్ పెరిగింది. ఇక పూరి అండ్ టీం ఇప్పటికీ ఇస్మార్ట్ ప్రమోషన్స్‌ని ఊరూరా భారీగా నిర్వహిస్తున్నారు. అంతేకాదు డియర్ కామ్రేడ్ టాక్ బాగా వీకవడంతో ఇస్మార్ట్‌కి ఇంకా కలిసొచ్చింది. మొదట్లో విజయ్ క్రేజ్‌తో డియర్ కామ్రేడ్.. ఇస్మార్ట్‌ని తొక్కేస్తాడనుకుంటే..ఇప్పుడు డియర్ కామ్రేడ్‌ని ఇస్మార్ట్ శంకర్ గట్టిగా తొక్కేశాడు. దాదాపు 70 కోట్ల కలెక్షన్ల తో దూసుకుపోతోంది.  చాలా కాలంగా గట్టి హిట్ కోసం ఎంతో ట్రై చేస్తున్న పూరి కి రామ్ కి ఇస్మార్ట్ శంకర్ ఊహించని హిట్ ని ఇచ్చింది. అసలు రామ్ కెరీర్ లోనే ఇంతగా కలెక్ట్ చేసిన సినిమా కూడా ఏదీ లేదు. ఇక ఈ సినిమాలో గ్లామర్ ను ఒలకబోసిన హీరోయిన్స్ కి వాళ్ళ ఖాతాలో మంచి హిట్ పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: