దక్షిణాది స్టార్ హీరోయిన కాజల్. పదేళ్ల క్రితం లక్ష్మీ కళ్యాణం సినిమాతో తన ప్రస్థానం మొదలు పెట్టి..ఇప్పటికీ యంగ్ హీరోయిన్లకు సవాల్ విసురుతూ గ్లామర్ మెయింటేన్ చేస్తూ కుర్ర హీరోల సరసన నటిస్తుంది.  మెగాస్టార్ టాప్ హీరోలందరి సరసన నటించిన లక్కీ హీరోయిన్ కాజల్ అనే చెప్పొచ్చు.  అలాంటి హీరోయిన్ ని దూరం నుంచి చూడాలన్నా కాస్త అదృష్టం చేసుకొని ఉండాలి.  అలాంటిది ఆ హీరోయిన్ తో ఫ్రెండ్ షిప్, డేటింగ్ అంటే వామ్మో జీవితం ధన్యమైనట్లే. ప్రస్తుతం  సోషల్ మీడియా, టెక్నాలజీ పెరిగాక చాలా మంది సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో చిక్కుకొని లక్షల్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు.

జనాల బలహీనతకి అవకాశంగా తీసుకొని చాలా మంది సైబర్ నేరగాళ్ళు ఎక్కువే అయ్యారు. ఈ మద్య కొత్త ట్రెండ్ తో సెలబ్రిటీల పేర్లు వాడుకొని మోసం చేసే నయా కేటుగాళ్ళు సొసైటీలో పెరిగిపోతున్నారు.  తాజాగా కాజల్ అగర్వాల్  అభిమానించే వ్యక్తి ఇలానే సైబర్ నేరగాళ్లు ఉచ్చులో పడి రూ.60 లక్షలు  పోగుట్టుకున్నాడు. తీరా తాను మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు.  పోలీసులు రంగ ప్రవేశంతో అసలు విషయం బయటకు వచ్చింది.  ఒక రోజు ఇంటర్నెట్‌ను చాట్ చేస్తుండగా.. మీకు బాగా ఇష్టమైన స్టార్‌తో డేటింగ్ చేసే అవకాశం కల్పిస్తామంటూ ఒక ప్రకటన వచ్చింది.

దానికి ఆకర్షితుడైన అతడు క్లిక్ చేసి అతని వివరాలు ఇచ్చాడు. ఆ తర్వాత అవతలి వ్యక్తి అతనికి కాజల్‌ను పరిచయం చేస్తానంటూ ముందుగా రూ.50 వేలు అడిగాడు.ఆ తర్వాత ఇంకొంత అమౌంట్ డిమాండ్ చేసాడు.  ఇలా  రూ.10 లక్షల వరకు సమర్పించుకున్న తర్వాత  అతను ఎంతకు కాజల్‌ను పరిచయం చేయకపోవడంతో చిర్రెత్తుకొచ్చి అసలు కాజల్ ని ఎప్పుడు పరిచయం చేస్తావంటూ గట్టిగా అడగంతో నువు కాజల్ తో డేటింగ్ కోసం అడిగావని మన మద్య సాగిన భండారం బయట పెట్టేస్తానంటూ బ్లాక్ మెయిల్ చేసాడు.

ఆ తర్వాత అతడి బ్లాక్ మెయిలర్ అతడి నుంచి ఏకంగా రూ.60 లక్షల వరకు లాగాడు.  తర్వాత ఆగకుండా ఇంకా పీడించడంతో అతడు వారి బాధను తట్టుకోలేక ఇంట్లోంచి పారిపోయాడు. ఈ విషయం తెలియక ఆ యువకుడి తల్లిదండ్రులు తమ కొడుకు కనిపించకుండా పోయాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. కాగా, కాజల్ అగర్వాల్ పేరుతో మోసం చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: