కాజల్.. టాలీవుడ్ అందాల చందమామ. ఆమె కెరీర్ వయసు పన్నెండేళ్ళు. ఆమె వయసు మాత్రం  ఎప్పటికీ  పదహారే. ఆ  సొగసు జలతారే. ఈ యువరాణి తెలుగు, తమిళ్ మూవీస్ వరసగా చేసేసి స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఈ మధ్యనే  సీత మూవీతో తెలుగులో లేడీ ఓరియెంటెడ్ మూవీని కూడా చేసి తన సత్తా చాటుకుంది. కాజల్ తోనే మరో మూవీకి డైరెక్టర్ తేజా రెడీ అవుతున్నారని న్యూస్ వస్తోంది.


ఇంతకు మించి టాలీవుడ్లో ఈ భామకు పెద్దగా చాన్సులు లేవు. మరో వైపు సీనియర్ హీరోలు తమ పక్కన చేయమని కాజల్ ని అడుగుతున్నారట. కొరటాల, మెగాస్టార్ కాంబోలో వచ్చే మూవీ కోసం కాజల్ ని తీసుకోవాలనుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే  ఓ విధంగా కాజల్ కి తెలుగులో కొంత గ్యాప్ వచ్చేసింది యంగ్ హీరోలు ఆమెను తీసుకోవడంలేదు. దాంతో చాన్సులు  ఒక్కసారిగా తగ్గిపోయాయి.


అయితే కాజల్ కి అనుకోకుండా ఓ హాలీవుడ్ మూవీలో చాన్స్ వచ్చిందట. దాంతో ఇపుడు ఈ చందమామ ఎగిరిగంతులు వేస్తోంది.   వచ్చే నెలలోనే ఈ మూవీ  షెడ్యూల్ మొదలుకానుందట. అందుకోసం జిమ్లో నానా  హైరానా పడుతోంది ఈ బ్యూటీ. ఎక్సర్‌సైజ్‌తో సాధించిన స్టిఫ్‌నెస్ పిక్స్ సోషల్ మీడియాకు వదలుతుండటంతో ఫ్యాన్స్ ఫిదా అయపోతున్నారు. కాజల్ అలా ఇలా కదట. రాత్రి పగలు తేడా లేకుండా జిమ్ కే జీవితాన్ని అంకితం చేస్తోందట. హాలీవుడ్ మూవీకి కావాల్సిన విధంగా ఫిజిక్ ని తయారుచేసుకుంటోందట. దాంతో కాజల్ మల్లె తీగలా, సన్నజాజిలా మారిపోతోందట.


 ఏది ఏమైనా ఇంకా కెరీర్ కొనసాగించాలన్న పట్టుదలతో ఉన్న కాజల్ కి బాలీవుడ్ పిలుపు వస్తుందనుకుంటే ఏకంగా హాలీవుడే ఇన్వైట్ చేయడంతో తెగ పొంగిపోతోందట. మూడు పదుల వయసులో కూడా నయాగరా జలపాతంలా తన అందంలో యూత్ గుండెలు చిదిమేస్తున్న ఈ బ్యూటీ హాలీవుడ్ లో ఎన్నెన్ని మెరుపులు మెరిపిస్తుందోనని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి మన చందమామ విశ్వ వేదికపైన వెలిగిపోవడం అంటే ఆనందమే కదా. గో యె హెడ్ కాజల్ అంటున్నారట సినీ జీవులంతా.


మరింత సమాచారం తెలుసుకోండి: