స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ‘నాపేరు సూర్య’ సినిమా డిజాస్టర్ కావటంతో దాదాపు చాలా లాంగ్ గ్యాప్ తీసుకుని ఖచ్చితంగా హిట్ కొట్టాలి ఉద్దేశంతో తీసుకున్న గ్యాప్ లో చాలా మంది డైరెక్టర్లు స్టోరీలు చెప్పిన ఎవరికి ఓకే చెప్పకుండా గతంలో తనకు రెండు బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ నే నమ్ముకుని సినిమా ఓకే చేయడం జరిగింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో నటిస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఈ సినిమాను ఎలాగైనా రాబోయే సంక్రాంతికి రిలీజ్ చేసి హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నారు బన్నీ త్రివిక్రమ్.


ఇదే క్రమంలో ఈ సినిమా చేస్తూనే వరుసగా మూడు ప్రాజెక్టు ఓకే చేసిన బన్నీకి ఇప్పుడు సదరు డైరెక్టర్ ల నుండి ఒత్తిడి వస్తున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. త్రివిక్రమ్ సినిమా చేస్తుండగానే  సుకుమార్‌, వేణు శ్రీరామ్‌, బోయపాటి శ్రీను ముగ్గురూ చెప్పిన కథలకు ఓకే చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో ముందుగా స్టోరీ చెప్పిన సుకుమార్ ఇప్పుడు అల్లు అర్జున్ ని తొందర పెడుతున్నట్లు సమాచారం.


స్టోరీ అంతా సిద్ధమైపోయింది సెప్టెంబర్ నెలలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని కొన్ని మీడియాకి లీకులు కూడా అందజేశారు. మరోపక్క ఇండస్ట్రీలో సుకుమార్‌ సినిమా రెగ్యులర్‌ కమర్షియల్‌ టైప్‌ కాదు. అందుకోసం బన్నీ ఒక గెటప్‌ వేసుకోవాలి. కనుక త్రివిక్రమ్‌ సినిమాతో ప్యారలల్‌గా చేసే వీలుండదు. ఎందుకంటే అది మాస్ కొత్త తరహా కథలు సినిమా అని సినిమాలో గంధపు చెక్కల స్మగ్లర్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. దీంతో వచ్చిన వార్తలన్నీబూటకమేనా టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: