అక్కినేని నాగార్జున కు సినీ ఇండస్ట్రీలో ఉన్న పేరు అప్పుడూ.. ఇప్పడూ.. ఎప్పుడూ టాలీవుడ్ మన్మధుడు అనే. అంతగా గ్లామర్ మెయింటెన్ చేస్తూ ఆయన ఎవర్ గ్రీన్ అందగాడు అనిపించుకుంటున్నాడు. ఆయన కెరీర్ లో మైలురాళ్లుగా చెప్పుకునే సినిమాల్లో ‘మన్మథుడు’ సినిమా కూడా ఒకటి. ఫ్యాన్స్, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ లో ఈ సినిమాకు అభిమానులు ఉన్నారు.

 

ఈ సినిమా గురించి నాగార్జున ఇటివల ఓ ఆసక్తికరమైన విషయం రివీల్ చేశారు. అదేంటంటే.. “ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఏమీ కాదు.. జస్ట్ ఎబౌవ్ ఏవరేజ్ సినిమా.. సినిమా లెక్కలు నాకు తెలుసు.. ఎందుకంటే నేనే ఈ ప్రొడ్యూసర్ ను కాబట్టి.. కాలానుగుణంగా కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అనిపిస్తూంటాయి” అని ఓ ఇంగ్లీష్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2003 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. నాగార్జున గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఎస్సెట్. దేవీశ్రీ సంగీతం, త్రివిక్రమ్ డైలాగ్స్, బ్రహ్మీ కామెడీ ఈ సినిమాకు ప్రధాన ఎస్సెట్స్. ఈ సినిమా హిట్ లో ప్రధాన పాత్ర పోషించిన త్రివిక్రమ్ కు నాగార్జున కోటి రూపాయల చెక్ తో పాటు కార్ కూడా బహుకరించాడని అప్పట్లో టాక్ వచ్చింది.

 

అలాంటి సినిమాపై ఇన్నేళ్లకు నాగార్జున ఆ సినిమా అబౌవ్ ఏవరేజ్ అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో టెలికాస్ట్ అయితే టీఆర్పీ రేటింగ్స్ తక్కువగా రావు. ప్రతి డైలాగ్, సీన్ మనసును హత్తుకుంటాయి. నాగార్జున ఆలోచనల ప్రకారం ఈ సినిమా అబౌవ్ ఏవరేజ్ అయినా ప్రేక్షకుల గుండెల్లో మాత్రం సినిమా ఇప్పటికీ సూపర్ హిట్టే అని చెప్పక తప్పదు.


మరింత సమాచారం తెలుసుకోండి: