అజయ్ భూపతి తెరక్కించిన  ఆర్ ఎక్స్ 100 సినిమా తో  టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఎమోషనల్  రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈచిత్రం లో బోల్డ్ పాత్రలో నటించింది  పాయల్.  తన గ్లామర్ కు  తో  యూత్ ఫిదా కావడంతో సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది.  దాంతో పాయల్  ఓవర్ నైట్ లో గుర్తింపు తెచ్చుకుంది.  ఈసినిమా తరువాత ప్రస్తుతం ఆమె  తెలుగు , తమిళంలో వరుస ఆఫర్లను అందుకుంటుంది. అందులో భాగంగా  ప్రస్తుతం పాయల్  వెంకీ మామా చిత్రంలో  వెంకటేశ్ కూడా జోడిగా నటిస్తుండగా మాస్ రాజా  రవితేజ సరసన  డిస్కోరాజా లో కూడా ఓ హీరోయిన్ గా నటిస్తుంది.  


ఇక వీటితో పాటు  'హుషారు'  తో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో  తేజస్ కంచర్ల తో కలిసి  'ఆర్ డి ఎక్స్ లవ్' అనే చిత్రంలో కూడా  నటిస్తుంది పాయల్.  ఈ రోజు ఈచిత్రం యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ ను విక్టరీ వెంకటేష్  విడుదలచేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో కూడా  మరో సారి పాయల్  బోల్డ్ క్యారెక్టర్ లో రెచ్చిపోయేలా వుంది. ఈసినిమాకథ అంతా ఆమె పాత్రా చుట్టూనే తిరుగుతుందట నూతన దర్శకుడు శంకర్ భాను  దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిసి కే ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై  ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. అర్జున్ రెడ్డి ఫేమ్ రధాన్ సంగీతం అందిస్తున్నాడు.  సెప్టెంబర్ లో ఈచిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.   మరి ఈ చిత్రం కూడా  ఆర్ ఎక్స్ 100 లాగే సెన్సేషన్ సృష్టిస్తుందో లేదో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: