నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రమణ్యం సినిమాలలో చిన్న చిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసాడు విజయ్ దేవరకొండ. పెళ్ళిచూపులు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ కెరీర్ మొదలైంది.పెళ్ళిచూపులు సినిమా సూపర్ హిట్ కావటంతో హీరోగా విజయ్ కు వరుసగా అవకాశాలు వచ్చాయి. పెళ్ళిచూపులు తరువాత విజయ్ ద్వారక అనే సినిమాలో దొంగ స్వామీజీ పాత్రలో నటించాడు. 
 
ద్వారక సినిమాకు సరైన టాక్ రాకపోవటంతో ఆ సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది. ద్వారక సినిమా తరువాత విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాలో నటించాడు. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కు ముందే భారీ అంచనాలు ఏర్పడటం ఆ అంచనాలకు తగినట్లే సినిమా ఉండటంతో అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్టైంది. విజయ్ దేవరకొండకు ఈ సినిమాతోనే యూత్లో క్రేజ్ విపరీతంగా పెరిగింది. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయ్ కు క్రేజ్ రావటంతో విజయ్ గతంలో ఎప్పుడో నటించిన ఏ మంత్రం వేశావె అనే సినిమా రిలీజ్ అయింది. 
 
విజయ్ దేవరకొండ ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొనకపోవటంతో ఈ సినిమాను ప్రేక్షకులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఈ సినిమా తరువాత విజయ్ ప్రత్యేక పాత్రలో నటించిన మహానటి హిట్ కాగా గీతా గోవిందం సినిమా 70 కోట్ల రుపాయల షేర్ సాధించి పెట్టిన పెట్టుబడికి మూడు రెట్ల లాభం అందించింది. గీతా గోవిందం సినిమా తరువాత తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన నోటా సినిమా రెండు భాషల్లో ఫ్లాప్ అయింది. 
 
నోటా తరువాత విజయ్ ట్యాక్సీవాలా అనే సినిమాలో నటించాడు. చాలా తక్కువ బడ్జెట్తో తీసిన ట్యాక్సీవాలా 24 కోట్ల రుపాయల షేర్ వసూళ్ళు అందుకుంది. గత వారం విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ విడుదలైంది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం నిర్మాతలు ఆశించిన స్థాయిలో రావట్లేదు. ఇలా విజయ్ దేవరకొండ కెరీర్లోని సినిమాలు ఐతే బ్లాక్ బస్టర్ అవుతున్నాయి లేదంటే డిజాస్టర్ అవుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: