ఇటీవల కొన్ని నెలల క్రితం టాలీవుడ్ సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిలను కొందరు కో ఆర్డినేటర్లు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, అటువంటి వారిపై గట్టిగా చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్ పై ధ్వజమెత్తిన శ్రీరెడ్డి, వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆ తరువాత అర్ధనగ్న ప్రదర్శన కూడా చేసిన విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజుల తరువాత పలు వివాదాలకు దారి తీసిన ఆ అంశంపై మా అసోసియేషన్ వారు సానుకూలంగా స్పందించడంతో మెల్లగా సర్దుమణిగింది. 

ఇక అప్పటినుండి శ్రీ రెడ్డి పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా మారుమ్రోగింది. ఇక ఆ మధ్య ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు తనయుడు అభిరాంతో తాను కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసి సంచలనానికి తెరలేపిన శ్రీ రెడ్డి, ఆ తరువాత నాచురల్ స్టార్ నాని, రచయిత కోన వెంకట్, దర్శకుడు కొరటాల శివ వంటి వారి పేర్లు కూడా బయటపెట్టింది. ఇక అంతటితో ఆగకుండా ఇప్పటికీ అప్పుడపుడు తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఆ సినిమా ప్రముఖులపై సెటైర్లు పిలుస్తూనే ఉంది. ఇకపోతే మొన్నటి శ్రావణ శుక్రవారం నాడు, నాచురల్ స్టార్ నాని పై ఆమె విరుచుకుపడుతూ కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. నాని నన్ను ఇంత టార్చర్ చేస్తున్న నీకు, నీకుటుంబానికి తప్పకుండా నా ఏడుపు తగిలి తీరుతుంది, ఈ శ్రావణ శుక్రవారం రోజన లక్ష్మి దేవి నీ ఇంటి నుండి వెళ్లి పోయి జ్యేష్టా దేవి నిన్ను వరించాలని కోరుకుంటున్నాను అంటూ ఆగ్రహంతో పోస్ట్ చేయడం జరిగింది. 

అయితే సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆమెను ఫాలో అవుతున్న వారిలోని కొందరు ఆమెను సమర్ధిస్తే, మరికొందరు మాత్రం ఆ విధంగా ఒక ప్రముఖ నటుడిగా మీరు ఇంత బహిరంగంగా ఘోర వ్యాఖ్యలు చేయడం తగదు, ఒకవేళ మీకు ఆయన వలన ఏదైనా నష్టం కలిగిఉంటే న్యాయంగా వెళ్ళండి, అంతేకాని వారి కుటుంబాన్ని కూడా నాశనం అవ్వాలి అంటూ నిందించడం సరైనది కాదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక గత రెండు రోజలుగా ఈ టాపిక్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే శ్రీరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటివరకు నాని స్పందించకపోవడం గమనార్హం.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: