కింగ్ నాగార్జున హీరోగా చిలసౌ ఫేమ్ రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న సినిమా మన్మథుడు 2. అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం జరిగింది. ఈవెంట్ లో భాగంగా మన్మథుడు సినిమా గురించి ప్రస్థావించారు నాగార్జున.   


విజయ్ భాస్కర్ డైరక్షన్ లో వచ్చిన మన్మథుడు సినిమా సూపర్ హిట్ తన కెరియర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమా అని అన్నారు నాగార్జున. విజయ భాస్కర్ పంచులతో ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమాకు దేవి మ్యూజిక్ కూడా చాలా బాగా హెల్ప్ అయ్యిందని అన్నారు. 


అయితే అంతా బాగానే ఉంది కాని మన్మథుడు దర్శకుడు మాత్రమే విజయ భాస్కర్.. కథ, మాటలు అందించింది త్రివిక్రం శ్రీనివాస్.. అలాంటిది త్రివిక్రం ను మర్చిపోయి విజయ భాస్కర్, డిఎస్పిల గురించి మాత్రమే మాట్లాడాడు నాగార్జున. మన్మథుడు అంత పెద్ద హిట్ అయ్యింది అంటే అది త్రివిక్రం పంచుల వల్లే.. మరి ఆ విషయం నాగార్జునకు తెలియదా లేదంటే త్రివిక్రం ను కావాలని స్కిప్ చేశాడా అన్నది తెలియాల్సి ఉంది.     


తనయులతో సినిమా చేయాలని త్రివిక్రం ను నాగార్జున అడిగినట్టు అప్పట్లో టాక్. కాని అందుకు త్రివిక్రం నిరాకరించడం వల్ల మన్మథుడు 2 ఈవెంట్ లో త్రివిక్రం పేరు ప్రస్థావించలేదని అంటున్నారు. నిన్న మన్మథుడు 2 ఈవెంట్ జరుగగా మరోపక్క శర్వానంద్ రణరంగం సినిమా ఆడియో ఈవెంట్ లో త్రివిక్రం పాల్గొనడం జరిగింది. మరి తను పిలిచినా రాలేదని నాగార్జునకు కోపం వచ్చి త్రివిక్రం గురించి మాట్లాడలేదా లేక వేరే కారణం ఏమైనా ఉందా అంటూ గుసగుసలాడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: