అల్లుడు శీనుతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన  బెల్లంకొండ శ్రీనివాస్  మొత్తానికి  "రాక్షసుడు"సినిమాతో నిజమైన హిట్ ను అందుకున్నాడు.  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా  రమేష్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో  బాక్సాఫీస్ వద్ద భారీ  హిట్ చిత్రం నిలిచింది.   ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ అద్భుతంగా వస్తున్నాయి.  శనివారం 85 శాతం అక్యుపెన్సీ అవ్వగా.. ఆదివారం నాటికి 100 శాతం అక్యుపెన్సీ అయిందట.  శ్రీనివాస్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రాక్షుసుడు నిలవడం విశేషం.  అయితే శ్రీనివాస్ తరువాత సినిమాలు కూడా  బాగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.   'దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో  బెల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా  'టైగర్ నాగేశ్వర్రావు' బయోపిక్ రూపొందుతున్న  విషయం తెలిసిందే.  


కాగా ప్రస్తుతం శరవేగంగా  ఈ సినిమా షూటింగ్ జరుగతుంది. అయితే సినిమాలో కూడా  శ్రీనివాస్  పాత్ర తాలూకు సన్నివేశాల్లోనే  మంచి ఫన్ ఉంటుందని..   గజదొంగగా శ్రీనివాస్  కామెడీ  బాగా చేస్తాడని తెలుస్తోంది.   ఇండియన్ రాబిన్ హుడ్ గా పేరుగాంచిన స్టువర్ట్‌ పురానికి చెందిన ఈ టైగర్ నాగేశ్వరరావు  1980 - 90 దశకాల్లో  స్టూవర్టుపురం గజదొంగగా  నేషనల్ లెవల్లో పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా శ్రీనివాస్ కెరీర్ లో ఓ స్పెషల్ ఫిల్మ్ గా నిలిచిపోతుందట. ఈ సినిమా కూడా హిట్ అవ్వడం పక్కా అని తెలుస్తోంది.   అలాగే  బాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాస్ తో సినిమా చెయ్యబోతుందట. బాలీవుడ్ లోనే ఆ సంస్థకి  గొప్ప సంస్థగా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయట. 


అలాంటి సంస్థ నుండి శ్రీనివాస్ కి ఛాన్స్ రావడానికి ప్రధాన కారణం..  హిందీ ప్రేక్షకులు  బెల్లంకొండ శ్రీనివాస్‌ లను యూట్యూబ్ లో బాగా ఇష్టంగా చూస్తున్నారు. శ్రీనివాస్ సినిమాల హిందీ వర్షన్స్ కు  టు హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దాటాయి.  మొత్తానికి శ్రీనివాస్ బాలీవుడ్ లోనే అగ్ర సంస్థ నిర్మణంలో త్వరలో హిందీ సినిమా చెయ్యబోతున్నాడు. అదేవిధంగా  వచ్చే ఏడాది దిల్‌రాజు బ్యానర్‌లోనూ శ్రీనివాస్ ఓ సినిమాను  చేస్తున్నాడు. దిల్ రాజు ఎప్పటినుండో ఈ సినిమా స్క్రిప్ట్ పై వర్క్ చేపిస్తున్నాడు. దీని బట్టి  సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుంది. ఆ లెక్కన ఈ సినిమా రూపంలో కూడా   బెల్లంకొండ శ్రీనివాస్ కి మరో హిట్ దొరికినట్లే. ఏమైనా ఇక  'బెల్లంకొండ'కు మంచి రోజులు వచ్చినట్లే  !    

  


మరింత సమాచారం తెలుసుకోండి: