తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) నిర్వహిస్తున్న భక్తి ఛానల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్‌విబిసి) చైర్మన్, డైరెక్టర్‌గా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెలుగు  హాస్యనటుడు బలిరెడ్డి పృద్వీ రాజ్‌ను నియమించిన విషయం మనందరికీ  తెలిసిందే. తాను కలలో కూడా ఇలాంటి పదవి వస్తుందని అనుకోలేదని, తనకి రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీ అయిన వైస్సార్సీపీ,తొమ్మిది సంవత్సరాల కాలంలో పార్టీ  అభివృద్ధి కోసం సామాన్య కార్యకర్తగా పనచేసారని దీనిని జగన్ గుర్తించారని ఆయన పేర్కోన్నారు.


జగన్ ముఖ్యమంత్రి కావాలని ఎన్నో మొకులు మొక్కుకున్నానని, పూజలు కూడా చేశానని తనకి జగన్ మీద ఉన్న అభిమానాన్ని ఆయన తెలియజేశారు. తిరుమలలో రాజకీయాలు తనుమాట్లాడనని అమరావతిలోనే  రాజకీయాల గురించి మాట్లాడతానని ఆయన వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తుల దైవప్రీతి కోసం తాను పటిష్టంగా పని చేస్తానని ఆయన వ్యక్తంచేశారు. ఎస్వీబీసీ ఛానళ్లో తాను కూడా ఐడీ కార్డు వేసుకుని ఓ మాములు ఉద్యోగిగా కొనసాగుతానని, ఛానల్లో పనిచేసే కాంట్రాక్ట్‌ కార్మికులను పర్మినెంట్‌ చేసేందుకు కృషి చేస్తానని, ముఖ్యమంత్రి దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్తానని ఆయన తెలియజేశారు. ఎస్వీబీసీ భక్తి ఛానల్ కు చైర్మన్‌గా నియమించిన, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలుపుతూ తనపై నమ్మకం ఉంచాలని ఆయన కోరారు.




భక్తి చానల్లో గతంలో జరిగిన అక్రమాలపై ఆయన మాట్లాడుతూ ఎవరిపైనా ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడాలనే ఉద్దేశం తమ ముఖ్యమంత్రికి గానీ, తనకు గానీ లేవని ప్రస్తుతం రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు నెలలో 20 రోజులు అక్కడే ఉంటున్నానని ఆయన తెలియజేశారు. ఎవరైనా గతంలో అక్రమాలు చేశారని రుజువైతే గనక తప్పకుండా చర్యలు తీసుకుంటామని చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన పేర్కోన్నారు. ఇది ఇలా ఉండగా తన సహాయ నటుడైన పోసాని కృష్ణమురళికి, తనకి ఏవో విభేదాలు అని వస్తున్న ఆరోపణలను ఆయన సమాధానం చెప్తూ వారిద్దరి మధ్య విభేదాలు లేవని, తమ మధ్య మనస్పర్థలు ఏర్పడినట్లు వస్తునవార్తల్లో వాస్తవం లేదని సినీ నటుడు పృథ్వీ రాజ్‌ ఖండించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: